BJP leader: ఆ రెండు పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదు..
ABN , Publish Date - Apr 23 , 2024 | 12:41 PM
కంటోన్మెంట్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్(BRS, Congress) పార్టీలకు ఉప ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జె.రామకృష్ణ(J. Ramakrishna) అన్నారు.
సికింద్రాబాద్: కంటోన్మెంట్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్(BRS, Congress) పార్టీలకు ఉప ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జె.రామకృష్ణ(J. Ramakrishna) అన్నారు. మంగళవారం కంటోన్మెంట్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గడిచిన పదేళ్లుగా బీఆర్‌ఎస్ కంటోన్మెంట్ ప్రజలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కంటోన్మెంట్ ప్రజలను ద్వితీయశ్రేణి పౌరులుగా చూసిందని, కంటోన్మెంట్ పట్ల సవతి తల్లి ప్రేమ ప్రదర్శించిందని ఆరోపించారు. బీజేపీ తరపున న్యాయ పోరాటం చేయడం వలన కేసీఆర్ సర్కారు అప్పట్లో దిగివచ్చి కంటోన్మెంట్‌కు రావలసిన టీపీటీ చార్జీల బకాయిలను కొంత మాత్రమే చెల్లించిందని పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి: AICC: ఫలించిన డీకే వ్యూహం.. నేటి సాయంత్రం మూడు సీట్లను ప్రకటించనున్న ఏఐసీసీ
ప్రస్తుత రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం కూడా న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయని భయపడి మరి కొంత బకాయిలను చెల్లించిందని రామకృష్ణ తెలిపారు. మల్కాజిగిరి లోక్‌సభ సభ్యునిగా ఉన్న కాలంలో అటు కంటోన్మెంట్‌కుగాని, ఇటు మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలోని ఇతర సెగ్మెంట్లకుగాని రేవంత్‌రెడ్డి ఒరగపెట్టిందేమీ లేదని అన్నారు. కంటోన్మెంట్ పాలకమండలి సమావేశాలకు సైతం రేవంత్‌రెడ్డి హాజరు కాలేదని, బోయినపల్లి శివార్లలో పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం మాత్రమే ఒకటి, రెండు సమావేశాలకు రేవంత్‌రెడ్డి హాజరయ్యారని తెలిపారు. ప్రధాని మోదీ సమర్థవంతమైన పాలన, బీజేపీ పట్ల రోజురోజుకూ పెరుగుతున్న ఆకర్షణతో కంటోన్మెంట్ ఉప ఎన్నికలో, మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నికల్లో కమలం పార్టీ విజయం ఖాయమని రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు.
ఇదికూడా చదవండి: Etala Rajender: పక్కాగా చెబుతున్నా.. మల్కాజిగిరి అభివృద్ధి బాధ్యత నాదే..
Read Latest Telangana News And Telugu News