ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Election 2024: లోక్‌సభ ఎన్నికల్లో మోదీ గాలి వీచింది.. బోయినపల్లి వినోద్ షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - May 18 , 2024 | 09:43 PM

లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Election 2024) పోలింగ్ సరళిపై బీఆర్ఎస్ (BRS) కరీంనగర్ అభ్యర్థి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapalli Vinod Kumar) హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ గాలి వీచిందన్నారు. రియాలిటీనీ దాచాల్సిన అవసరం లేదని చెప్పారు.

Boinapalli Vinod Kumar

కరీంనగర్: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Election 2024) పోలింగ్ సరళిపై బీఆర్ఎస్ (BRS) కరీంనగర్ అభ్యర్థి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapalli Vinod Kumar) హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ గాలి వీచిందన్నారు. రియాలిటీనీ దాచాల్సిన అవసరం లేదని చెప్పారు. తమ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందో తనకు తెలియదన్నారు. కేసీఆర్ మాత్రం 10 ఎంపీ స్థానాలు గెలుస్తామని అంటున్నారని చెప్పారు. ఎన్నికలు ముగిశాయి కాబట్టి వాస్తవాలు మాట్లాడుకోవాలని తెలిపారు.


YS Jagan: వైఎస్ జగన్ లండన్ వెళ్తుండగా.. గన్నవరం ఎయిర్‌పోర్టులో అసలేం జరిగింది..?

శనివారం బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో బోయినపల్లి వినోద్ మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి గొప్పగా చెప్పుకునే పథకం ఒక్కటి కూడా తెలంగాణలో అమలు చేయడం లేదని విమర్శించారు. రైతులకు రోహిణి కార్తెలోనే పెట్టుబడి సహాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పంటలు కోసిన తర్వాత ఇటీవల రైతుబంధు ఇచ్చారని చెప్పుకొచ్చారు. వర్షాకాలానికి సంబంధించి రైతు బంధు, రైతు భరోసా వెంటనే ఇవ్వాలని కోరారు. వరికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన హామీ బోగస్‌గా మార్చవద్దని హితవు పలికారు.


Big Breaking: ఏపీలోని మూడు జిల్లాలకు ఎస్పీల నియామకం

సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇచ్చే ఆలోచన చేయడం సరికాదన్నారు. సన్న వడ్లకే బోనస్ ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి ఉంటే కాంగ్రెస్‌కు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకపోతుండేదని చెప్పారు. మరో ఆరు నెలలు పోతే రేవంత్ ప్రభుత్వాన్ని ఎవరు నమ్మరని చెప్పారు. తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధర ఇచ్చి కొనాలని డిమాండ్ చేశారు.ఇచ్చిన హామీలు అమలు చేసేలా కేబినెట్ నిర్ణయాలు తీసుకోవాలని బోయినపల్లి వినోద్ కుమార్ కోరారు.


ఇవి కూడా చదవండి

Lok Sabha Election 2024: తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుస్తాం: కిషన్‌రెడ్డి

Malla Reddy: మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత

Jeevan Reddy: కాంగ్రెస్ వస్తే రామాలయాన్ని బుల్డోజర్‌తో కూల్చేస్తారనడం దారుణం

Read more Telagana News and Telugu News

Updated Date - May 18 , 2024 | 10:02 PM

Advertising
Advertising