ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Political Strategy: బడ్జెట్‌లో అన్యాయం జరిగిందనుకుంటే కాంగ్రెస్‌ ఎంపీలు రాజీనామా చేయాలి

ABN, Publish Date - Jul 25 , 2024 | 04:03 AM

బీఆర్‌ఎస్‌ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ఏటీఎంలా వాడుకున్నారని, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకునే ప్రయత్నం చేస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి విమర్శించారు.

  • బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కాళేశ్వరం మాదిరిగా.. కాంగ్రెస్‌ సర్కారుకు ఏటీఎంగా మూసీ

  • ఏపీకి15 వేల కోట్లు ఇస్తే అసూయా?

  • ఏపీకి హోదా ఇవ్వకపోవడం ద్వారా రాష్ట్రానికి ప్రధాని మోదీ మేలు చేశారు

  • అందుకు మోదీకి క్షీరాభిషేకం చేయాలి: బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ఏటీఎంలా వాడుకున్నారని, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకునే ప్రయత్నం చేస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ పెద్దలకు దగ్గరగా ఉండే గుత్తేదారులకు పనులు అప్పగించటానికే విషపూరిత ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌పై నిర్వహించిన చర్చలో మహేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. ఏపీకి రూ.15 వేల కోట్లు ఇచ్చినందుకు ఎందుకు అసూయ పడుతున్నారని, పెడితే పెళ్లి కోరతారు.. లేకపోతే చావు కోరతారా? కొడంగల్‌కు రూ. 4 వేల కోట్లను సీఎం రేవంత్‌రెడ్డి తీసుకెళ్తే... ఇతర జిల్లాల వాళ్లు అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్‌ చేస్తే పెడతారా? అని ప్రశ్నించారు.


మోదీ సర్కారును లక్ష్యంగా చేసుకుంటే.. సీఎం రేవంత్‌రెడ్డికి తన కుర్చీ పదిలంగా ఉంటుందనే వ్యూహం తప్ప వేరేదిలేదని అన్నారు. గడిచిన పదేళ్లలో ఈ రాష్ట్రానికి రూ. 9.28 లక్షల కోట్లు కేంద్రం నుంచి వచ్చాయని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రానికి మోదీ మేలుచేశారని, ఒకవేళ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చివుంటే.. పెట్టుబడులు, పరిశ్రమలు అన్నీ ఆ రాష్ట్రానికే వెళ్లేవని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు మోదీకి క్షీరాభిషేకం చేయాలని కాంగ్రెస్‌ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని భావిస్తే కాంగ్రెస్‌ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.


స్పందించిన మంత్రి పొంగులేటి, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ... కాంగ్రెస్‌ ఎంపీలను రాజీనామా చేయాలని కోరటం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు సహా బీజేపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే కేంద్రం దిగొచ్చి రాష్ట్రానికి నిధులు కేటాయిస్తుందని అన్నారు. అనంతరం మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ... అమృత్‌ స్కీమ్‌లో రాష్ట్రానికి రూ. 3,500 కోట్లు మంజూరైతే... టెండర్లు పిలవకుండా కాంట్రాక్టర్లకు పంచిపెట్టారని పేర్కొన్నారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనవసరమైన విమర్శలు చేశారని, వారిద్దరూ ఒకే మతం, ఒకే పార్టీ, ఒకే ధర్మాన్ని నమ్ముకున్న భరతమాత ముద్దుబిడ్డలని మహేశ్వర్‌రెడ్డి కొనియాడారు.

Updated Date - Jul 25 , 2024 | 04:03 AM

Advertising
Advertising
<