Revanth Reddy: నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన
ABN , Publish Date - Apr 19 , 2024 | 09:11 AM
నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మొత్తం సుడిగాలి పర్యటన చేయనున్నారు. మిషన్ 15 రీచ్ అయ్యేలా టీ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. తెలంగాణ ఎన్నికలను పూర్తిగా రేవంత్ తన భుజాలపై వేసుకున్నారు. తమ ప్రభుత్వ పాలనకు పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండం అని తెలిపారు. నేటి నుంచి ప్రచారాన్ని ఉధృతం చేయనున్నారు. నేటి నుంచి మే 11 వరకూ 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 50 సభలు, ర్యాలీలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.
హైదరాబాద్: నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలంగాణ మొత్తం సుడిగాలి పర్యటన చేయనున్నారు. మిషన్ 15 రీచ్ అయ్యేలా టీ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. తెలంగాణ ఎన్నికలను పూర్తిగా రేవంత్ తన భుజాలపై వేసుకున్నారు. తమ ప్రభుత్వ పాలనకు పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండం అని తెలిపారు. నేటి నుంచి ప్రచారాన్ని ఉధృతం చేయనున్నారు. నేటి నుంచి మే 11 వరకూ 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 50 సభలు, ర్యాలీలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. నేడు మహబూబ్ నగర్‌లో పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు.
గంగవరం నుంచి విశాఖ పోర్టుకు బొగ్గు నౌకలు
ఈ రోజు సాయంత్రం మహబూబాబాద్‌లో జరిగే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. రేపు మెదక్ అభ్యర్థి నీలం మధుకి మద్దతుగా ర్యాలీ, సభలో.. 21న భువనగిరిలో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమంలో.. 22న మధ్యాహ్నం ఆదిలాబాద్ లో నిర్వహించే సభలో.. 23న నాగర్ కర్నూల్‌లో జరిగే బహిరంగ సభలో.. 24న ఉదయం జహీరాబాద్, సాయంత్రం వరంగల్‌లో నిర్వహించే సభల్లో.. 25న చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా ర్యాలీతో పాటు సభలోనూ సీఎం రేవంత్ పాల్గొననున్నారు.
Sharmila: కర్నూలు జిల్లాలో నేటి నుంచి షర్మిల న్యాయ యాత్ర
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..