Share News

Hyderabad: హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలి..

ABN , Publish Date - Oct 10 , 2024 | 12:05 PM

సుప్రీంకోర్టు సౌత్‌ ఇండియా రీజినల్‌ బెంచ్‌ను హైదరాబాద్‌(Hyderabad:)లో ఏర్పాటు చేయాలని దక్షిణ భారత అడ్వకేట్‌ జేఏసీ అధ్యక్షుడు సుధా నాగేందర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Hyderabad: హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలి..

- దక్షిణ భారత అడ్వకేట్‌ జేఎసీ అధ్యక్షుడు సుధా నాగేందర్‌

హైదరాబాద్: సుప్రీంకోర్టు సౌత్‌ ఇండియా రీజినల్‌ బెంచ్‌ను హైదరాబాద్‌(Hyderabad:)లో ఏర్పాటు చేయాలని దక్షిణ భారత అడ్వకేట్‌ జేఏసీ అధ్యక్షుడు సుధా నాగేందర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదే డిమాండ్‌తో దక్షిణ భారత అడ్వకేట్‌ జేఏసీ ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. బుధవారం నల్లకుంటలోని కార్యాలయంలో సుప్రీంకోర్టు న్యాయవాది వినాయక్‌రావు, హైకోర్టు న్యాయవాది భూపాల్‌రాజ్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు రీజినల్‌ బెంచ్‌ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 10న మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నల్లకుంట(Nallakunta)లోని దక్షిణ భారత అడ్వకేట్‌ జేఎసీ కార్యాలయంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. సమావేశానికి సుప్రీంకోర్టు న్యాయ వాదులు, మేధావులు, పలువురు ప్రముఖులు హాజరవుతారని ఆయన తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: KTR: ఎక్కడా లేని అరుదైన వారసత్వం మన బతుకమ్మ


.................................................................

ఈ వార్తను కూడా చదవండి:

....................................................................

BRS: రాష్ట్రంలో పోలీసు రాజ్యం సాగుతోంది..

- హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం

- బీఆర్‌ఎస్‌ యువజన నేత ముఠా జైసింహ

హైదరాబాద్: హామీలు అమలు చేయని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీ నేతలను అక్రమంగా గృహ నిర్బంధం చేసే అధికారం లేదని బీఆర్‌ఎస్‌ యువజన నాయకుడు ముఠా జైసింహ(Mutha Jaisimha) విమర్శించారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం సాగుతున్నదని ధ్వజమెత్తారు. బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పత్రాల పంపిణీ నేపథ్యంలో ప్రతిపక్ష పారీలు నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ, చిక్కడపల్లి ఏసీపీ ఆదేశాల మేరకు ముషీరాబాద్‌ సీఐ రాంబాబు ఆధ్వర్యంలో పోలీసులు ముఠా జైసింహ, ఆయన అనుచరులను గాంధీనగర్‌(Gandhinagar)లోని నివాసంలో హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

city7.jpg


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) బీఆర్‌ఎస్‌ నాయకులను చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కారణం చూపకుండా పోలీసులు ముందస్తు అరెస్ట్‌ చేయడం ఎంత వరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలో బుధవారం తాను అనేక అమ్మవారి పూజలు, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా, పోలీసులు తనను హౌస్‌ అరెస్ట్‌ చేయడంతో తన అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారని వాపోయారు.

city7.2.jpg


సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల వరకు వెంటనే రుణమాఫీ చేయాలని, వర్షాకాలం రైతుబంధు నిధులు విడుదల చేయాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని, మహిళలకు మహాలక్ష్మి పథకం అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసే వరకు కేసీఆర్‌, కేటీఆర్‌ల నాయకత్వంలో తమ పోరాటం కొనసా గుతుందన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు దీన్‌దయాల్‌రెడ్డి తదితరులు హౌస్‌ అరెస్టులో ఉన్నారు.


ఇదికూడా చదవండి: Revanth Reddy: దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది..

ఇదికూడా చదవండి: KTR: మూసీ పేరిట లక్ష కోట్ల దోపిడీకి యత్నం

ఇదికూడా చదవండి: Ponnam: సున్నాకే పరిమితమైనా బుద్ధి మారలేదు

ఇదికూడా చదవండి: Sangareddy: సంగారెడ్డిలో నవజాత శిశువు కిడ్నాప్‌

Read Latest Telangana News and National News

Updated Date - Oct 10 , 2024 | 01:04 PM

News Hub