Bandi Sanjay : తెలంగాణలో ఆర్కే బ్రదర్స్ పాలన.. బండి సంజయ్ సంచలన ఆరోపణలు
ABN, Publish Date - Nov 17 , 2024 | 02:10 PM
ఢిల్లీలో సెటిల్మెంట్ చేసుకోవడంతో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ కథ కంచికి పోయిందిని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ ఫార్ములా, ధరణి స్కాం కేసులన్నీ గాలికే పోయాయని విమర్శలు చేశారు.
సంగారెడ్డి జిల్లా: తెలంగాణలో ఆర్కే బ్రదర్స్ పాలన నడుస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. సంగారెడ్డిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఆ కేసులన్నీ గాలికే పోయాయి...
‘ఢిల్లీలో సెటిల్మెంట్ చేసుకోవడంతో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ కథ కంచికి పోయింది. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ ఫార్ములా, ధరణి స్కాం కేసులన్నీ గాలికే పోయాయి. కలెక్టర్‌పై దాడి సూత్రధారి కేటీఆర్ అని తేలినా అరెస్ట్ చేయకపోవడం సిగ్గు చేటు. కేటీఆర్‌ను అరెస్ట్ చేయకపోవడం సర్కార్ చేతగానితనమే. కేసీఆర్, రేవంత్ కుటుంబానికి మధ్య వ్యాపార సంబంధాలున్నయి. నేను నిరూపిస్తా….కేసీఆర్ ఫ్యామిలీ రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమా. నాకు, రేవంత్ మధ్య వ్యాపార సంబంధాలున్నాయని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా’’ అని బండి సంజయ్ సవాల్ విసిరారు.
దాడులు తెరపైకి తెచ్చారు..
‘‘రైతుల సమస్యలను పక్కదారి పట్టించేందుకే దాడులు తెరపైకి తెచ్చారు. బీఆర్ఎస్ విధ్వంసకర పార్టీ. దాడులతో ప్రజల ప్రాణాలతో బీఆర్ఎస్ చెలగాటాలాడుతోంది.గ్రూప్ -1, కానిస్టేబుల్ ఆందోళనలోనూ బీఆర్ఎస్ విధ్వంసం చేయాలనుకుంది. తెలంగాణలో బీఆర్ఎస్‌ను నిషేధించాలి. రాష్ట్ర ప్రజలు వాస్తవాలు ఆలోచించండి.నేను కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నా. రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు నాకు అప్పగించే అవకాశాల్లేవు’’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
Updated Date - Nov 17 , 2024 | 02:41 PM