ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం

ABN, Publish Date - Jul 23 , 2024 | 03:52 PM

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేశారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల కోసమే బడ్జెట్ పెట్టినట్లు ఉందని విమర్శించారు.

MP Mallu Ravi

ఢిల్లీ: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేశారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి (MP Mallu Ravi) అన్నారు. ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల కోసమే బడ్జెట్ పెట్టినట్లు ఉందని విమర్శించారు. వాళ్ల ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే రెండు రాష్ట్రాలకు కేటాయింపులు చేశారని మండిపడ్డారు. ఢిల్లీ వేదికగా ఈరోజు(మంగళవారం) మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ... విభజన చట్టం గురించి చాలాసార్లు ప్రస్తావించారు కానీ తెలంగాణ అన్న పదం కూడా వాడలేదని ధ్వజమెత్తారు.


KTR: తెలంగాణకు ఈ బడ్జెట్‌లో ఇచ్చింది గుండు సున్నా..

హైదరాబాద్ మినహా 9 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలుగా గుర్తించినప్పటికీ తెలంగాణకు కేటాయింపులు లేవని.. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు నిధులు కేటాయించడంలో తమకు అభ్యంతరం లేదు, కానీ తెలంగాణకు కేటాయింపులు లేకపోవడం బాధాకరమని చెప్పారు. పాలమూరు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి పూర్తిచేయాలని సీఎం, మంత్రులు విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదని అన్నారు.


CM Revanth Reddy: కీలకమైన సమయంలో వారు మన మధ్య లేకపోవడం బాధాకరం

విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల ప్రస్తావన లేకపోవడం దారుణమని మండిపడ్డారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారని, ఇద్దరు మంత్రులు ఉన్నారు అయిన తెలంగాణకు దక్కింది ఏం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ ఎంపీలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి బుద్దిచెప్పాలని అన్నారు. తెలంగాణ హక్కుల సాధనకు అందరూ ఎంపీలు కలిసికట్టుగా పోరాడేందుకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. బీజేపీ, ఎంఐఎం ఎంపీలను కలిసి ఉమ్మడి పొరటాలపై చర్చిస్తామని తెలిపారు. తెలంగాణ హక్కుల సాధనకు అలుపులేని పోరాటం చేస్తామని ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు.


కేంద్రం తీరును ఖండిస్తున్నాం: ఎంపీ కడియం కావ్య

తెలంగాణ పుట్టకను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇష్టపడటం లేదని వరంగల్ ఎంపీ కడియం కావ్య విమర్శించారు. తెలంగాణకు నరేంద్ర మోదీ మొండి చెయ్యి చూపించారని మండిపడ్డారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తెలంగాణలో రూ. 7 లక్షల కోట్లు అప్పులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో తెలంగాణకు ఏమైనా ఇస్తారేమోనని చూశామని అన్నారు. కేంద్రం తీరును ఖండిస్తున్నామని కడియం కావ్య తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

KTR: అసెంబ్లీలో కేసీఆర్ ఛాంబర్‌పై కేటీఆర్ అసంతృప్తి

TS Assembly: గట్టి కౌంటర్‌కు కాంగ్రెస్ రెడీ.. నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 23 , 2024 | 05:34 PM

Advertising
Advertising
<