ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dharmendra Pradhan: తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి సంచలన ఆరోపణలు

ABN, Publish Date - Jul 12 , 2024 | 06:04 PM

తెలంగాణలో సామాన్య కార్యకర్త సీఎం అయ్యే అవకాశాలున్నాయని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Union Minister Dharmendra Pradhan) తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సామాన్యుడు సీఎం అవుతాడని చెప్పారు.

Union Minister Dharmendra Pradhan

శంషాబాద్: తెలంగాణలో సామాన్య కార్యకర్త సీఎం అయ్యే అవకాశాలున్నాయని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Union Minister Dharmendra Pradhan) తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సామాన్యుడు సీఎం అవుతాడని చెప్పారు. బీజేపీలో చేరిన వారంతా పాత నాయకులేనని అన్నారు. మల్కాజ్‌గిరి ఈటల రాజేందర్ పార్టీలో కొత్త నాయకుడు కాదు.. పాత నేత అయిపోయారని అన్నారు.

దక్షిణ భారతదేశంలో బీజేపీ బలపడిందని చెప్పారు. బీజేపీ కార్యవర్గ సమావేశాలను ఈరోజు(శుక్రవారం) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ... కేరళలో బీజేపీ ఖాతా తెరిచిందని.. తమిళనాడులో మెరుగైన ఓటు బ్యాంక్ సాధించామని వివరించారు.


తెలంగాణలో బీజేపీని నెంబర్ వన్ పార్టీగా మార్చేందుకు తమ దగ్గర 1500 రోజుల ప్రణాళిక ఉందని ప్రకటించారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తరచూ అవమాన పరిస్తుందని మండిపడ్డారు. ఎన్డీఏ అధికారంలో ఉన్నని రోజులు రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్ననీ రోజులు రిజర్వేషన్లకు ఎటువంటి డోక లేదని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రభుత్వం హిందూ విరోధి అని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ కోసం బీజేపీ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు.


గత పదేళ్లుగా ఒక కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిందని ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో పోలింగ్ బూత్ లెవెల్‌లో బీజేపీని మరింత బలపర్చాల్సిన అవసరం ఉందని వివరించారు. పార్టీలో కొత్త పాత లేదని చెప్పారు. కాంగ్రెస్ - బీ ఆర్ఎస్‌లకు నిద్ర పట్టకుండా చేస్తేనే బీజేపీ ఫస్ట్ స్థానంలోకి వస్తుందని పిలుపునిచ్చారు. ఊర్లో ఉన్న ప్రతి సమస్యను బీజేపీ కార్యకర్త సామరస్యంగా పరిష్కరించాలని కోరారు. టాప్ 5 ఎకనామిక్ సిటీస్‌లో హైదరాబాద్ ఉందని తెలిపారు.

Updated Date - Jul 12 , 2024 | 06:04 PM

Advertising
Advertising
<