ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vinod Kumar: తెలంగాణ శాసన మండలి మనుగడకు ప్రమాదం

ABN, Publish Date - Jul 05 , 2024 | 04:27 PM

తెలంగాణ శాసన మండలి మనుగడకు ప్రమాదం ఏర్పడిందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapally Vinod Kumar) విమర్శించారు. శాసన మండలి పూర్తిగా రద్దు అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Boinapally Vinod Kumar

హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి మనుగడకు ప్రమాదం ఏర్పడిందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapally Vinod Kumar) అన్నారు. శాసన మండలి పూర్తిగా రద్దు అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆర్టికల్ 169 ప్రకారం శాసన మండలిలో సీట్లు 40కంటే తక్కువ ఉండకూడదని చెప్పారు. ఆర్టికల్ 171 ప్రకారం శాసనసభ సీట్లలో 1/3 వంతు కౌన్సిల్ సభ్యులు ఉండాలి.. కానీ ప్రస్తుతం శాసన మండలి ఉనికి ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేను తొలగించడం వల్ల అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 119కి తగ్గిందని అన్నారు. ఇప్పుడు రాజ్యాంగ నిబంధనల ప్రకారం 1/3 అంటే కౌన్సిల్ సంఖ్య 39కి పడిపోయిందని దీంతో తెలంగాణ కౌన్సిల్ మనుగడ ప్రమాదంలో పడిందని అన్నారు.


తెలంగాణ శాసన మండలి కొనసాగాలంటే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగాలని చెప్పుకొచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం కేంద్రంలో కీలకంగా ఉన్నారని గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచడానికి కృషి చేయాలని కోరారు. తెలంగాణ ఆస్తుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ కావొద్దని కోరారు. శాసన సభ సీట్లను పెంచాలని ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 26లో స్పష్టంగా ఉందన్నారు. ఈ అంశం కోసం తాము ప్రధానమంత్రి నరేంద్రమోదీని, లా మినిస్టర్‌ను కలిసి చాలాసార్లు కోరామని కానీ మోదీ ఈ అంశాన్ని దాట వేశారని గుర్తుచేశారు. కానీ అదే మోదీ కాశ్మీర్‌లో సీట్లను పెంచుకోలేదా అని బోయినపల్లి వినోద్ కుమార్ ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

UK Elections 2024: నన్ను క్షమించండి.. రిషి సునాక్ కీలక ప్రకటన..

Amarnath Yatra: ఒక్కరోజులోనే హైదరాబాద్ టూ అమర్‌నాథ్ యాత్ర.. ఖర్చు, జర్నీ విశేషాలివే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 05 , 2024 | 04:57 PM

Advertising
Advertising