Share News

Hydra News: హైడ్రా సంచలన నిర్ణయం! రంగం సిద్ధం!

ABN , Publish Date - Aug 29 , 2024 | 07:15 PM

భాగ్యనగరం హైదరాబాద్‌లో చెరువులు, నాళాలను ఆక్రమించి ఇళ్లు, భవనాలు నిర్మించిన వారిని హైడ్రా హడలెత్తిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు అక్రమాలకు పాల్పడినవారిపై దృష్టించిన హైడ్రా.. చెరువుల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Hydra News: హైడ్రా సంచలన నిర్ణయం! రంగం సిద్ధం!

హైదరాబాద్: భాగ్యనగరం హైదరాబాద్‌లో చెరువులు, నాళాలను ఆక్రమించి ఇళ్లు, భవనాలు నిర్మించిన వారిని హైడ్రా హడలెత్తిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు అక్రమాలకు పాల్పడినవారిపై దృష్టించిన హైడ్రా.. చెరువుల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు హైడ్రా రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. సైబరాబాద్ పరిధిలో ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సైబరాబాద్ కమిషనర్‌కు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిఫారసు చేశారు.


దీంతో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఇళ్ల నిర్మాణానిని అనుమతి ఇచ్చిన అధికారులపై కేసులు నమోదు కానున్నాయి. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో పాటు టౌన్ ప్లానింగ్ అధికారులపై కేసులు పెట్టనున్నారు.


సీఎంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ

సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇవాళ (గురువారం) భేటీ అయ్యారు.హైడ్రా విస్తరణపై కోర్ట్ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కమిషనర్ రంగనాథ్ తీసుకెళ్లారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తే ఎదురయ్యే సమస్యలపై అధ్యయనం చేసి ముందుకు వెళ్లాలని రంగనాథ్‌కు సీఎం రేవంత్ సూచించారు.

Updated Date - Aug 29 , 2024 | 07:15 PM