ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG Politics: ఏపీలో అల్లర్లపై కఠినంగా వ్యవహరించాలి: కిషన్‌రెడ్డి

ABN, Publish Date - May 15 , 2024 | 05:06 PM

ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని.. ఎన్డీఏ కూటమి గెలుస్తుందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు.ఏపీలో అల్లర్లపై కేంద్ర ఎన్నికల కమిషన్, ఏపీ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించారు.

Kishan Reddy

ఢిల్లీ: ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని.. ఎన్డీఏ కూటమి గెలుస్తుందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో అల్లర్లపై కేంద్ర ఎన్నికల కమిషన్, ఏపీ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని అన్నారు. ఏపీలో ఎన్నికలపై కొంత నిరాశ, నిస్పృహ ఉండొచ్చని.. అందుకే అల్లర్లు జరిగి ఉండొచ్చని తెలిపారు. ప్రజల్లో మార్పు రావడంతో అభ్యర్థులు గొడవకు దిగారని అన్నారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పుకొచ్చారు. ప్రజలు ఎవరు కాంగ్రెస్ అసత్య ప్రచారాన్ని నమ్మలేదని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లను తీసివేస్తుందని కాంగ్రెస్ చెప్పిందని.. ఈ విషయాన్ని ప్రజలు నమ్మలేదని చెప్పుకొచ్చారు.


KTR: రైతులను విస్మరించి రాజకీయాలపైనే సర్కార్ దృష్టి

ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విష ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదన్నారు. కాంగ్రెస్ గుర్తు మారిపోయిందేమో.. ప్రజలు ఆ పార్టీ గుర్తు గాడిద గుడ్డు అని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉందన్నారు.


BJP: కమలనాథుల కదనోత్సాహం.. ఓటింగ్‌ సరళిపై సంతృప్తి

తెలంగాణలో ఒక్క బస్సు పథకం మాత్రమే నడుస్తుందని.. దానికి ఆర్టీసీకి నిధులు చెల్లించడం లేదని అన్నారు. మహిళలకు రూ.2 వేలు, నిరుద్యోగ భృతి, రైతు కూలీలకు రూ. 12 వేలు, తులం బంగారం అన్నారని.. వాటిని కూడా ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. 420 హామీలు రేవంత్ రెడ్డి ఇచ్చారని.. ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని అన్నారు.ఎన్నికల ముందు మోదీని విమర్శించారని చెప్పారు. ప్రజలు జూన్ 4న ఇచ్చే ఫలితం ఏ రకంగా ఉండబోతుందో చూస్తారని తెలిపారు. కాంగ్రెస్ హామీలు నెరవేర్చాలని ప్రజల పక్షాన తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.


CM Revanth Reddy: సచివాలయంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

నీచమైన రాజకీయాలు దిగజారాకుండా రేవంత్ రెడ్డి వ్యవహరించాలని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉందన్నారు. ఆర్థిక వనరుల సమీకరణ ఏవిధంగా చేయబోతున్నారో రేవంత్ చెప్పాలన్నారు. హామీలపై కాంగ్రెస్ వైఖరి ఏంటో ప్రజలకు చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రానికి వచ్చారని.. ఆ హామీలు నెరవేర్చకుండా.. మళ్లీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు కూడా కొత్త హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.


తాము పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్తామని అన్నారు. మల్కాజ్‌గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్‌లో బీజేపీకి కొంత ఓట్ల శాతం తగ్గిందని చెప్పారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు కొన్ని ఓట్లను కాంగ్రెస్ కుట్రతో తీసేసిందని ఆరోపించారు. రేపు ఎన్నికల కమిషన్‌కి బీజేపీ మద్దతు దారుల ఓట్లు తీసేయడంపై ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉండదని.. ఓటర్ కార్డును ఆధార్‌కి లింక్ చేయాలని కిషన్‌రెడ్డి సూచించారు.

ఇవి కూడా చదవండి

AP Politics: టియర్ గ్యాస్‌ ఎఫెక్ట్.. జేసీకి అస్వస్థత

AP Elections: అంతలోనే మాట మారింది..?

Updated Date - May 15 , 2024 | 06:40 PM

Advertising
Advertising