Share News

కేటీఆర్‌ సహకారంతో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు

ABN , Publish Date - Feb 10 , 2024 | 12:20 AM

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్‌ సహకారంతో మున్సిపల్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమ వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళాచక్రపాణి అన్నారు.

కేటీఆర్‌ సహకారంతో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు
విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్మన్‌

సిరిసిల్ల టౌన్‌, ఫిబ్రవరి 9: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్‌ సహకారంతో మున్సిపల్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమ వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళాచక్రపాణి అన్నారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో మున్సిపల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళాచక్రపాణి, వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్‌ స్ఫూర్తితోనే చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. నాడు తెలంగాణలో రజాకర్లకు వ్యతిరేకంగా ఐలమ్మ పోరాటాలు చేసిందన్నారు. తెలంగాణ కోసం ముందుండి పోరాటాలు చేసిన ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసుకొని గౌరవించాలన్న సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ సహకారంతో జిల్లా కేంద్రంలో ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నట్లు చెప్పారు. ఐలమ్మ విగ్రహం ఆవిష్కరణకు సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఎండీ అయాజ్‌, డీఈ ప్రసాద్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు వెల్దండి దేవదాస్‌, అన్నారం శ్రీనివాస్‌, దార్నం అరుణలక్ష్మినారాయణ, లింగంపల్లి సత్యనారాయణ, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, బీఆర్‌ఎస్‌ నాయకులు దార్ల సందీప్‌, అడగట్ల మురళి, కల్లూరి మధు, కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, రజక సంఘం పట్టణం అధ్యక్షుడు దండు శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి కాసర్ల మహేందర్‌, ఉపాధ్యక్షులు మారుపాక పెద్ద శ్రీనివాస్‌, కాసర్ల శ్రీనివాస్‌, కాసర్ల వెంకటేష్‌, పోతరాజు గౌరయ్య, కోశాధికారి బండి శ్రీనివాస్‌, ప్రచార కార్యదర్శి కాసర్ల శ్రీనివాస్‌, గౌరవ సలహాదారు దండు ఎల్లయ్య, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

ఫ చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణకు నలుగురు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు మాత్రమే హాజరవడం చర్చనీయాంశంగా మారింది. సిరిసిల్ల మున్సిపల్‌ పాలక వర్గంలో 39 మంది కౌన్సిలర్లకు దాదాపు 33 మంది ఆ పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు. కేవలం నలుగురే పాల్గొన్నారు.

Updated Date - Feb 10 , 2024 | 12:20 AM