Share News

KTR: రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు

ABN , Publish Date - Oct 24 , 2024 | 04:03 AM

పోలీసు వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన కబంధహస్తాల్లో పెట్టుకున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ప్రతిపక్షాలను అణగదొక్కేందుకే పోలీసులను వినియోగిస్తుండడంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు

KTR: రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు

  • సీఎం రేవంత్‌ కబంధహస్తాల్లో పోలీస్‌ వ్యవస్థ

  • వెంటనే హోంశాఖ మంత్రిని నియమించాలి

  • మోదీని సంతృప్తిపరిచేలా రేవంత్‌ నిర్ణయాలు

  • ప్రతిగా రేవంత్‌ దుర్మార్గాలపై బీజేపీ మౌనం: కేటీఆర్‌

  • అంబర్‌పేటలో దారుణహత్యకు గురైన వృద్ధ దంపతుల కుటుంబానికి పరామర్శ

రాంనగర్‌,/హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): పోలీసు వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన కబంధహస్తాల్లో పెట్టుకున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ప్రతిపక్షాలను అణగదొక్కేందుకే పోలీసులను వినియోగిస్తుండడంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించిపోయాయని, పట్టపగలే హత్యలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వకుండా.. వారి విధులకు ప్రభుత్వంలోని పెద్దలు అడ్డంకులు సృష్టిస్తుండడంతో వారు డ్యూటీలు కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారు. వెంటనే హోంశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్‌ చేశారు.


ప్రశాంతమైన హైదారబాద్‌ నగరంలో పట్టపగలు హత్యలు జరుగుతున్నాయంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీ్‌సస్టేషన్‌ పరిధి సెంట్రల్‌ ఎక్సైజ్‌ కాలనీలో ఇటీవల హత్యకు గురైన వృద్ధ దంపతులు పి.లింగారెడ్డి, పి.ఊర్మిళారెడ్డిల కుమార్తెలను బుధవారం అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి కేటీఆర్‌ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియా మాట్లాడుతూ.. హత్యకు పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


  • సీసీ కెమెరాల నిర్వహణ చేయలేని ప్రభుత్వం..

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పది లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని కేటీఆర్‌ చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటి నిర్వహణను కూడా చేయలేని స్థితిలో ఉందని విమర్శించారు. చాలామంది సీనియర్‌ సిటిజన్లు హైదరాబాద్‌లో ఒంటరిగా ఇళ్లలో ఉంటారని, అలాంటి వారికి రక్షణ కల్పించాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. అదానికి మేలు చేేసలా రేవంత్‌ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొంటోందని, అందుకే సీఎం చేేస దుర్మార్గాలపై బీజేపీ మౌనంగా ఉంటోందని విమర్శించారు. మూసీ దిగువన రామన్నపేటలో అంబుజా సిమెంట్‌ ప్లాంట్‌ కోసం బూటకపు ప్రజాభిప్రాయ ేసకరణ నిర్వహించడం ద్వారా అదానీని సంతృప్తి పరుస్తున్నారని తెలిపారు.

Updated Date - Oct 24 , 2024 | 04:03 AM