Graduate MLC Elections: కాంగ్రెస్ బ్లాక్ మెయిలర్‌ను ఓడించాలి: కేటీఆర్
ABN, Publish Date - May 20 , 2024 | 09:25 PM
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ అయిన ఇచ్చాడా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) ప్రశ్నించారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బ్లాక్ మెయిలర్ తీన్నార్ మల్లన్న కావాలో.. బీఆర్ఎస్ గోల్డ్ మెడల్ ఏనుగుల రాకేష్ రెడ్డి కావాలో ఆలోచించుకోవాలని అన్నారు.
ఖమ్మం జిల్లా: రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ అయిన ఇచ్చాడా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) ప్రశ్నించారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బ్లాక్ మెయిలర్ తీన్నార్ మల్లన్న కావాలో.. బీఆర్ఎస్ గోల్డ్ మెడల్ ఏనుగుల రాకేష్ రెడ్డి కావాలో ఆలోచించుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానని చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని గల్లా పట్టి అడిగే వ్యక్తి రాకేష్ రెడ్డి అని చెప్పారు.
ఖమ్మం నగరంలోని ఎస్బీఐటీ కాలేజ్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. పట్టభద్రుల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కారు గుర్తుపై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కేటీఆర్ కోరారు.
ప్రశ్నించే గొంతు శాసనమండలిలో ఉండాలి..
‘‘శాసనసభ, లోక్‌సభలో ప్రజలు ఏకపక్ష ధోరణి ఇస్తే ప్రజాస్వామ్యాన్ని సమతుల్యంగా కొలిచేందుకు శాసనమండలి ఏర్పాటు చేశారు. పట్టభద్రుల తరఫున, తెలంగాణ నిరుద్యోగుల తరఫున పోరాడేందుకు ఏ విధంగా ఉండాలో మీరే నిర్ణయించుకోండి. మీరు పట్టం కట్టే వ్యక్తి బ్లాక్‌మెయిల్ రాజకీయాలు, బూతు పురాణం మాట్లాడే వ్యక్తి కావాలో మీరే నిర్ణయించుకొండి. రాకేష్ రెడ్డి రైతు కుటుంబం నుంచి వచ్చి స్వతహాగా ఎదిగిన వ్యక్తి. ఆయన అమెరికాలో ఫేస్‌బుక్ లాంటి పెద్ద కంపెనీల్లో పని చేశారు. మనకోసం మనకు సేవ చేసేందుకు రాకేష్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చాడు. బీఆర్ఎస్ తరఫున గోల్డ్ మెడల్ సాధించిన రాకేష్ రెడ్డి ఉంటే, కాంగ్రెస్ పార్టీ తరఫున బ్లాక్ మెయిలర్, బూతులు మాట్లాడే వ్యక్తి జైలుకు వెళ్లిన వ్యక్తి ఉన్నాడు. ఆడపిల్లల గౌరవాలకు భంగం కలిగించిన వ్యక్తి పట్టభద్రులకు వెళ్లకూడదు ఆలోచించుకోండి. ప్రశ్నించే గొంతు శాసనమండలిలో ఉండాలి అది రాకేష్ రెడ్డితోనే సాధ్యం. కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పే ప్రయత్నం చేస్తుంది. మాజీమంత్రి పువ్వాడ అజయ్ కష్టపడి ఐదేళ్లు పనిచేశారు. దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయారు. రాకేష్ రెడ్డిని కూడా గెలిపించి శాసనమండలికి పంపించండి. రేవంత్ ప్రభుత్వం ఇస్తానని చెప్పిన నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాల గురించి రాకేష్ రెడ్డి పోరాడతారు’’ అని కేటీఆర్ తెలిపారు.
వారికి నేను సవాల్ చేశా..
‘‘సమాజంలో మంచికంటే చెడు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. సోషల్ మీడియాలో మంచి మాటలు చెప్పే రాకేష్ రెడ్డి లాంటి వ్యక్తి మాటలు ఎవరు నమ్మరు, తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి బూతులు మాట్లాడితే ఎక్కువ మంది చూస్తారు. ఖమ్మం నగరం గత పదేళ్లలో సర్వాంగ సుందరంగా మారింది. 9 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు, దేశంలో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, బీజేపీ నాయకులను నేను ప్రశ్నించాను. మేము ఇచ్చినన్ని ఉద్యోగాలు ఏ రాష్ట్రమైనా ఇచ్చిందా, ఇస్తే చూపించండి అని సవాల్ చేశా.కేసీఆర్ ప్రభుత్వంలో వరంగల్, ఖమ్మం నగరాలకు సాఫ్ట్‌వేర్ కంపెనీలను తీసుకొచ్చాం. వరంగల్‌కు టెక్ మహీంద్రా వంటి కంపెనీలు వస్తే రేవంత్ రెడ్డి వచ్చాక అవి తిరిగి వెళ్లిపోతున్నాయి. 2014లో మనం వచ్చేనాటికి తెలంగాణలో ఐటీ విలువ రూ.55వేల కోట్లు, మన ప్రభుత్వం దిగిపోయే నాటికి ఐటీ విలువ రూ.2 లక్షల కోట్లు. మాజీ సీఎం కేసీఆర్ పంపిన చక్కటి గ్రాడ్యుయేట్ రాకేష్ రెడ్డిని ఆశీర్వదించి గెలిపించండి. ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొని మీ అభిప్రాయాన్ని, విలువైన ఓటును వినియోగించుకోండి. విద్యావంతులు ఓటు వేయకపోతే బ్లాక్ మెయిలర్లు, దొంగలు రాజ్యమేలుతారు. మొదటి ప్రాధాన్యత ఓటు బ్యాలెట్‌లో మూడో నెంబర్‌లోని రాకేష్ రెడ్డిపై వేసి గెలిపించాలి’’ అని కేటీఆర్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సిట్ దర్యాప్తులో అసలు వాస్తవాలు..!
జగన్ ఓటమి తధ్యం.. మరోమారు స్పష్టం చేసిన పీకే
చంద్రబాబుతో టచ్‌లోకి ఏపీ అధికారులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - May 20 , 2024 | 09:49 PM