Share News

Kunamneni: జూలై 5న కోల్‌బెల్ట్‌ బంద్‌ ..

ABN , Publish Date - Jun 27 , 2024 | 05:46 AM

బొగ్గు గనుల వేలానికి నిరసనగా జూలై 5న కోల్‌బెల్ట్‌ బంద్‌కు పిలుపునిచ్చినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. 15 రోజులపాటు సీపీఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు, కలెక్టరేట్ల ముట్టడి చేపడతామని చెప్పారు.

Kunamneni: జూలై 5న కోల్‌బెల్ట్‌ బంద్‌ ..

  • సింగరేణి పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పోరాటానికి సిద్ధం కావాలి: కూనంనేని

హైదరాబాద్‌, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): బొగ్గు గనుల వేలానికి నిరసనగా జూలై 5న కోల్‌బెల్ట్‌ బంద్‌కు పిలుపునిచ్చినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. 15 రోజులపాటు సీపీఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు, కలెక్టరేట్ల ముట్టడి చేపడతామని చెప్పారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న సింగరేణిలేని తెలంగాణను ఊహించుకోలేమన్నారు. బుధవారం మగ్దుంభవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్‌ ఇచ్చిన మాటకు భిన్నంగా వ్యవహరించారని, కేంద్ర ప్రభుత్వానికి గనులు రాసిచ్చారని తెలిపారు.


సింగరేణిని ప్రైవేటుపరం చేయబోమని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారన్నారు. బొగ్గు గనులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ప్రధాని మోదీ కుట్రలో కిషన్‌రెడ్డి భాగస్వాములయ్యారని, ఆయన తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. గతంలో ప్రైవేటు పరం చేసిన బొగ్గు గనుల లీజును రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వం పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Updated Date - Jun 27 , 2024 | 05:46 AM