Share News

TS News: రూ.53 లక్షలు పట్టుకున్న పోలీసులు.. డబ్బులు ఎంత చాకచక్యంగా తరలిస్తున్నారంటే..

ABN , Publish Date - May 09 , 2024 | 09:28 AM

హైదరాబాద్‌లో పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడింది. చాకచక్యంగా కాలేజ్ బ్యాగులో డబ్బు పెట్టి బైక్‌పై తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కూకట్‌పల్లిలోని వసంత్ నగర్ బస్టాప్ వద్దకు అనుమానాస్పదంగా రెండు హీరో ఫ్యాషన్ ప్రో బైక్‌లపై వచ్చారు. వారు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకుని పోలీసులు సోదా చేయగా.. వారిలో ఒకరి వద్ద గల బ్లాక్ కలర్ కాలేజీ బ్యాగ్‌‌లో రూ. 53 లక్షల37 వేల500 లభ్యమయ్యాయి.

TS News: రూ.53 లక్షలు పట్టుకున్న పోలీసులు.. డబ్బులు ఎంత చాకచక్యంగా తరలిస్తున్నారంటే..

హైదరాబాద్: హైదరాబాద్‌లో పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడింది. చాకచక్యంగా కాలేజ్ బ్యాగులో డబ్బు పెట్టి బైక్‌పై తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కూకట్‌పల్లిలోని వసంత్ నగర్ బస్టాప్ వద్దకు అనుమానాస్పదంగా రెండు హీరో ఫ్యాషన్ ప్రో బైక్‌లపై వచ్చారు. వారు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకుని పోలీసులు సోదా చేయగా.. వారిలో ఒకరి వద్ద గల బ్లాక్ కలర్ కాలేజీ బ్యాగ్‌‌లో రూ. 53 లక్షల37 వేల500 లభ్యమయ్యాయి. దీనిని హవాలా డబ్బుగా పోలీసులు అనుమానిస్తున్నారు. విచారించిన పోలీసులకు అది హవాలా డబ్బు అని తెలిసింది.

Loksabha Polls 2024: నేడు తెలంగాణకి రానున్న రాహుల్ గాంధీ


గౌరీ శంకర్ రియల్ ఎస్టేట్ సంస్థలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న నాగరాజు, అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ముసల నాయుడు అనే ఇద్దరు వ్యక్తులు వారి యజమాని ఆదేశాల మేరకు బహదూర్‌పురాకు వెళ్లారు. అక్కడ ఒక వ్యక్తి నుంచి రూ. 53 లక్షల37 వేల500ను తీసుకుని కూకట్‌పల్లిలోని వసంత్ నగర్‌లో గౌరీ శంకర్ రియల్ ఎస్టేట్‌కు చెరవేస్తున్న క్రమంలో పోలీసులు ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బును ఎంత పకడ్బందీగా తరలిస్తున్నారంటే.. రెండు వేర్వేరు బైక్‌లను ఉపయోగిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా కాలేజ్ విద్యార్థులు ఉపయోగించే షోల్డర్ బ్యాగ్‌లో డబ్బును అక్రమ రవాణా చేస్తున్నారు. డబ్బులతో కూడిన బైక్‌ను మరో బైక్ ఫాలో అవుతూ పోలీసు చెకింగ్‌లను గమనిస్తూ డబ్బును అక్రమ రవాణా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

PM Modi : అదానీ, అంబానీ నుంచి ఎంత ముట్టింది?

KCR : చిన్నపాటి వానకే పది గంటలు కరెంట్‌ పోతదా?

Read more Telangana News and Telugu News

Updated Date - May 09 , 2024 | 09:28 AM