జగన్‌ను శిక్షించాలా.. వద్దా..: సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Nov 03 , 2024 | 07:56 AM

రుషికొండలో జగన్ ఇంత విలాసవంతమైన భవనాలను ఎందుకు నిర్మించారో అర్థం కావడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. రుషులు తపస్సు చేసిన రుషికొండ అంటే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ఒక మైలురాయి అని, అలాంటి రుషికొండకు గుండు కొట్టించారని, పర్యావరణ ప్రేమికులు కొందరు దీనిపై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌కు,హైకోర్టుకు ఫిర్యాదు చేసినా, కేంద్రం జోక్యం చేసుకున్నాసరే కనిపించకుండా ప్రజాధనంతో నిర్మాణాలు చేసేశారన్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

విశాఖ: ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి రుషికొండ ప్యాలస్ నిర్మించిన జగన్‌ను శిక్షించాలా.. వద్దా.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. సీఎం హోదాలో మొదటిసారి ఆయన రుషికొండ ప్యాలెస్‌ను పరిశీలించారు. ఒక సీఎం అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎలాంటి దుర్మార్గానికి పాల్పడ్డాడో తెలిపేందుకు రుషికొండ ప్యాలెస్ నిర్మాణం ఒక కేసు స్టడీగా మారిందన్నారు. తవ్వెకొద్దీ ఆశ్చర్యకరమైన ఘటనలు బయటకు వస్తున్నాయన్నారు. రుషులు ధ్యానం చేసిన కొండను.. తన విలాసాల కోసం జగన్ విధ్వంసం చేశారని చంద్రబాబు ఆవేదన వ్కక్తం చేశారు.


జగన్ ఇంత విలాసవంతమైన భవనాలను ఎందుకు నిర్మించారో అర్థం కావడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. రుషులు తపస్సు చేసిన రుషికొండ అంటే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ఒక మైలురాయి అని, అలాంటి రుషికొండకు గుండు కొట్టించారని, పర్యావరణ ప్రేమికులు కొందరు దీనిపై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌కు,హైకోర్టుకు ఫిర్యాదు చేసినా, కేంద్రం జోక్యం చేసుకున్నాసరే కనిపించకుండా ప్రజాధనంతో నిర్మాణాలు చేసేశారన్నారు. రుషికొండను తవ్వేసి విలాసవంతమైన భవనాలను నిర్మిస్తున్నారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరగడంతో తాను, పవన్‌కల్యాణ్‌ స్వయంగా చూసేందుకు యత్ని స్తే అడ్డుకున్నారని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అడ్డగోలుగా ఎలా వ్యవహరించారో చెప్పడానికి ఇదొక కేస్‌ స్టడీ అని, ఇప్పుడు ఈ భవనాల వినియోగంపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రజలే మాకు అప్పగించడం ప్రజాస్వామ్యం ఎంత బలమైనదో చెప్పడానికి ఉదాహరణ అపి చంద్రబాబు వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వారికి అదే చివరి రోజు: సీఎం చంద్రబాబు

ఇదేం విలాసం!?

మరీ ఇంత నీచమా?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 03 , 2024 | 07:58 AM