రౌడీలకు సీఎం చంద్రబాబు వార్నింగ్‌

ABN, Publish Date - Oct 21 , 2024 | 10:24 AM

ఉమ్మడి రాష్ట్రంలో ఫ్యాక్షనిజం, రౌడీల ఆట కట్టించామని, శాంతిభద్రత కాపాడటంలో రాజీపదే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు అన్నారు. పోలీసు సంక్షేమం తమ ప్రభుత్వ బాధ్యతని, రాష్ట్ర విభజన తర్వాత పోలీస్‌ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చామని, వాహనాలు, పరికరాలు, సాంకేతిక సౌకర్యం కల్పించామన్నారు.

అమరావతి: రౌడీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వార్నింగ్‌ ఇచ్చారు. రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తే ఊరుకోమని, నేరాలు చేసేవారికి అదే చివరి రోజు అని సీఎం హెచ్చరించారు. గత జగన్ ప్రభుత్వం కక్షసాధింపులే పనిగా పెట్టుకుందని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. సోమవారం విజయవాడలో పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రాణాలు అర్పించిన పోలీసులకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో నక్సలిజాన్ని ఉక్కుపాదంతో అణచివేశామన్నారు.


ఉమ్మడి రాష్ట్రంలో ఫ్యాక్షనిజం, రౌడీల ఆట కట్టించామని, శాంతిభద్రత కాపాడటంలో రాజీపదే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు అన్నారు. పోలీసు సంక్షేమం తమ ప్రభుత్వ బాధ్యతని, రాష్ట్ర విభజన తర్వాత పోలీస్‌ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చామని, వాహనాలు, పరికరాలు, సాంకేతిక సౌకర్యం కల్పించామన్నారు. ఏపీ పోలీసు అంటే దేశంలోనే మోడల్‌గా తీర్చిదిద్దాలని ముందుకెళ్లామన్నారు. 2014-19లో రూ.600 కోట్లు ఖర్చు పెట్టామని, నూతన వాహనాల కోసం రూ.150 కోట్లు ఖర్చు చేశామన్నారు. పోలీస్‌ ఆఫీస్‌ల మరమ్మతులు, నిర్వహణ కోసం రూ.60 కోట్లు ఖర్చుచేశామని సీఎం చంద్రబాబు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అతని బ్యాంక్ ఖాతాల్లో కోట్ల కొద్దీ డబ్బు..

జగన్‌ తీరును తప్పుపడుతున్న నాయకులు

పున్నమీఘాట్ వ‌ద్ద 5 వేల‌కుపైగా డ్రోన్లతో మెగా షో

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 21 , 2024 | 10:24 AM