Yuzvendra Chahal-RJ Mahvash: భర్త గురించి ఆర్జే మహ్‌వష్ పోస్ట్.. ఛాహల్ రియాక్షన్ ఏంటంటే
ABN , Publish Date - Apr 03 , 2025 | 04:59 PM
భార్య ధనశ్రీ వర్మతో విడాకులు, ఆమెకు ఛాహల్ భారీగా భరణం ఇచ్చినట్టు వచ్చిన వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. అంతేకాదు రేడీయో జాకీ మహ్‌వష్‌తో డేటింగ్ అంటూ వార్తలు కూడా వచ్చాయి. ఆ డేటింగ్ వార్తలను మహ్‌వష్ కొట్టిపడేసింది.

టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర ఛాహల్ (Yuzvendra Chahal) వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు ఇటీవలి కాలంలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. భార్య ధనశ్రీ వర్మ (Dhanashree Verma)తో విడాకులు, ఆమెకు ఛాహల్ భారీగా భరణం ఇచ్చినట్టు వచ్చిన వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. అంతేకాదు రేడీయో జాకీ మహ్‌వష్ (RJ Mahvash)తో డేటింగ్ అంటూ వార్తలు కూడా వచ్చాయి. ఆ డేటింగ్ వార్తలను మహ్‌వష్ కొట్టిపడేసింది.
తనకు ఛాహల్ కేవలం స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేసింది. అయితే ఆమె సోషల్ మీడియాలో ఇండైరెక్ట్‌గా చేస్తున్న పోస్ట్‌లు మాత్రం అనుమానాలకు కారణమవుతున్నాయి. తాజాగా మహ్‌వష్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నా జీవితంలోకి ఏ అబ్బాయి అయితే వస్తాడో.. అతడే నాకు అన్నీ. అతడే నాకు స్నేహితుడు. అతడే నా ప్రియుడు. అతడే నా భర్త. నా జీవితం అతడి చుట్టూనే తిరుగుతుంది. నాకు ఇంకెవరూ వద్దు. అప్పుడు నేను వేరే అబ్బాయిలతో మాట్లాడలేను అంటూ మహ్‌వష్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
మహ్‌వష్ చేసిన పోస్ట్‌ను ఛాహల్ లైక్ చేశాడు. దీంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఘటనపై నెటిజన్లు తమ స్పందనలు తెలియజేస్తున్నారు. ఈ పోస్ట్ చూసి ఛాహల్ హాయిగా నవ్వుకుంటున్నాడని ఒకరు కామెంట్ చేశారు. మహ్‌వష్ పోస్ట్‌కు ఛాహల్ కొట్టిన లైక్ శాశ్వతం, మిగిలినవన్నీ తాత్కాలికమే అంటూ మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Shubman Gill- Abrar Ahmed: గిల్‌కు ఇచ్చిన వార్నింగ్ ఏంటి.. పాక్ స్పిన్నర్‌ను నిలదీసిన లేడీ ఫ్యాన్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..