విజయసాయి రెడ్డి దోపిడీ ముఠా..: సోమిరెడ్డి
ABN, Publish Date - Dec 23 , 2024 | 12:22 PM
నాలుగున్నర లక్షల టన్నుల నాసిరకం బొగ్గును టన్ను 8,500 రూపాయల చొప్పున జెన్‌కోకు విజయసాయి అనుబంధ సంస్థ అమ్మిందని, నాసిరకం బొగ్గు వల్ల విద్యుత్తుత్పత్తి లేక పీక్ లోడ్‌లో 14 రూపాయల మేర అధిక ధరకు విద్యుత్ కొని ప్రజలపై ఆ భారాన్ని మోపారని సోమిరెడ్డి ఆరోపించారు.
నెల్లూరు: విజయసాయి రెడ్డి దోపిడీ ముఠా గత 5 ఏళ్లలో చేయని కుంభకోణం అంటూ లేదని, ఫార్మా రంగంలో ఎదిగిన అరబిందో, విజయసాయి రెడ్డి దురాశ కారణంగానే ప్రజా ధనాన్ని లూటీ చేసిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. 2022లో జెన్‌కోకు నాసిరకం బొగ్గు సరఫరా కారణంగా జనరేషన్ లాస్ జరిగిందని, దీంతో బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయటం వల్ల దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందన్నారు.
నాలుగున్నర లక్షల టన్నుల నాసిరకం బొగ్గును టన్ను 8,500 రూపాయల చొప్పున జెన్‌కోకు విజయసాయి అనుబంధ సంస్థ అమ్మిందని, నాసిరకం బొగ్గు వల్ల విద్యుత్ ఉత్పత్తి లేక పీక్ లోడ్‌లో 14 రూపాయల మేర అధిక ధరకు విద్యుత్ కొని ప్రజలపై ఆ భారాన్ని మోపారని సోమిరెడ్డి ఆరోపించారు. నాసిరకం బొగ్గుపై జెన్కో ఉద్యోగులు, టీడీపీ నేతల తిరుగుబాటుతో దాదాపు లక్ష టన్నుల డంపింగ్ యార్డ్‌కు తరలించారని, విజయసాయి రెడ్డి వియ్యంకుడి ఆదాయం కోసం ప్రజలపై ట్రూ అప్ చార్జీలు బాదారని సోమిరెడ్డి విమర్శించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
యూట్యూబ్ కొత్త గైడ్‌లైన్స్ ఇవే..
పేర్ని నాని భార్య జయసుధపై లుకౌట్ నోటీసు..
కృష్ణాజిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన
పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Dec 23 , 2024 | 12:22 PM