Share News

DilsukhNagar Blasts Case: హైకోర్టు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ

ABN , Publish Date - Apr 07 , 2025 | 09:24 PM

Dilsukhnagar blasts case: దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన రియాజ్ భత్కల్ నేటికి దొరకలేదు. అలాంటి కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పును మరికొద్ది గంటల్లో వెలువరించనుంది.

DilsukhNagar Blasts Case: హైకోర్టు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ
DilsukhNagar Blasts Case

హైదరాబాద్, ఏప్రిల్ 07: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లు కేసులో తెలంగాణ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో హైకోర్టు తీర్పుపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. 2013లో అంటే.. నాటి యూపీఏ హయాంలో ఈ బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 18 మంది మృతి చెందగా.. మరో 130 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ బాంబు పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. 2016లో యాసిన్ భత్కల్‌తో సహా ఐదుగురికి ఉరి శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఈ కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ముద్దాయిలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ఇప్పటికీ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే.


బాంబు పేలుళ్లు.. వివరాలు..

2013 ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాద్‌లోని దిల్‌‌సుఖ్‌ నగర్‌లో పేలుళ్లు సంభవించాయి. ఈ దాడిలో 18 మంది మరణించారు. 130 మందికి తీవ్ర గాయాలయ్యాయి.ఈ కేసును NIA (జాతీయ దర్యాప్తు సంస్థ)దర్యాప్తు జరిపింది. ఈ కేసు విచారణలో భాగంగా 157 మంది సాక్ష్యాలను రికార్డ్ చేసింది. ఈ దర్యాప్తులో ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్‌ భత్కల్‌ ప్రధాన నిందితుడని తేలింది.


ఇక నిందితులలో అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసీన్ అఖ్తర్, ఎజాజ్ షేక్, సయ్యద్ మక్బూల్ నిందితులుగా ఉన్నారు. మూడేళ్లపాటు జరిపిన విచారణ అనంతరం.. నిందితులకు మరణశిక్ష విధించింది. ఈ కేసుతో పాటు పలు ఉగ్రదాడుల్లో కీలకంగా వ్యవహరించిన యాసిన్‌ భత్కల్‌ను 2013లో బీహార్‌- నేపాల్‌ బోర్డర్‌లో అరెస్ట్ చేశారు. దిల్లీ (2008), దిల్‌సుఖ్ నగర్‌ పేలుళ్ల కేసుతో పాటు ఇతర కేసుల్లో అతడు దోషిగా తేలాడు. దీంతో అతడు తీహార్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి..

TGSRTC: ఎండీకి నోటీసులు.. మోగనున్న సమ్మె సైరన్

Vaniya Agarwal: మైక్రోసాఫ్ట్‌ను అల్లాడించిన వానియా అగర్వాల్ ఎవరు

Rains: ఓరి నాయనా.. ఎండలు మండుతుంటే.. ఈ వర్షాలు ఏందిరా

Student: వారం పాటు.. వారణాసిలో దారుణం..

Mamata Banerjee: హామీ ఇస్తున్నా.. జైలుకెళ్లేందు సిద్ధం..

Nara Lokesh: ‘సారీ గయ్స్‌..హెల్ప్‌ చేయలేకపోతున్నా’: మంత్రి లోకేశ్‌

LPG Price Hiked: పెరిగిన సిలిండర్ ధర.. ఎంతంటే..

Updated Date - Apr 07 , 2025 | 09:56 PM