1700 గదుల రాజభవనం .. 7వేల లగ్జరీ కార్లు

ABN, Publish Date - Sep 04 , 2024 | 09:26 AM

ప్రధాని నరేంద్రమోదీ బ్రూనై పర్యటనకు వెళ్లారు. తొలిసారిగా ఆయన బ్రూనైలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ దేశ రాజు హసనల్‌ బోల్కియా గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆయనకు సంబంధించిన పలు విషయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. హసనల్‌ బోల్కియా పేరిట అరుదైన రికార్డులు ఉన్నాయి.

ABN Internet: ప్రధాని నరేంద్రమోదీ బ్రూనై పర్యటనకు వెళ్లారు. తొలిసారిగా ఆయన బ్రూనైలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ దేశ రాజు హసనల్‌ బోల్కియా గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆయనకు సంబంధించిన పలు విషయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. హసనల్‌ బోల్కియా పేరిట అరుదైన రికార్డులు ఉన్నాయి. కేవలం ఒక్కసారి ట్రిమ్ చేయించుకునేందుకు లక్షల రూపాయలను ఖర్చు చేశారని నివేదికలు చెబుతున్నాయి. ఆ రాజ కుటుంబానికి సంబంధించి ఎన్నో విషయాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం.


హసనల్‌ బోల్కియా 1946లో జన్మించారు. రాజకుటుంబంలో జన్మించిన సుల్తాన్‌ విద్యాభ్యాసం విదేశాల్లో జరిగింది. 19 ఏళ్ల వయస్సులో తన కజిన్‌ పెంగ్రియన్‌ అనక సలేహ్‌ను వివాహం చేసుకొన్నారు. ఇది పెద్దలు కుదర్చిన పెళ్లి. 1968లో తండ్రి పదవి నుంచి తప్పుకోవడంతో.. ఈయన బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఎక్కువ కాలం పాలకుడిగా ఉన్న రికార్డు హసనల్‌ పేరిట ఉంది. క్వీన్‌ ఎలిజిబెత్‌-2 తర్వాత అత్యధికకాలం పదవిలో కొనసాగారు.


సుల్తాన్‌ హసనల్‌ ఎంతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఆయన లైఫ్ గురించి తెలుసుకునేవారు ఆశ్చర్యపోకతప్పదు. హసనల్ రాజ కుటుంబ సంపద దాదాపు 40 బిలియన్‌ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా. వారి ప్రధాన ఆదాయం బ్రూనైలో చమురు-గ్యాస్‌ నుంచే వస్తోంది. దీని ద్వారా సంపద రెట్టింపు అవుతూనే ఉంది. ఈ బ్రూనై రాజు హెయిర్‌ కట్‌ కోసం ఏకంగా వేల కిలోమీటర్లు తన ప్రైవేటు జెట్‌లో ప్రయాణిస్తారు. లండన్‌కు వెళ్లి ది డోర్‌చెస్టర్‌ హోటల్‌లోని ఓ బార్బర్‌ వద్ద హెయిర్ కట్ చేయించుకుంటారు. దీని కోసం 20 వేల డాలర్లు (రూ.16.5 లక్షలు) ఖర్చు చేస్తున్నారు.


బ్రూనై సుల్తాన్ ఉండే రాజభవనం అతి పెద్దది. ఇదులో 17 వందల గదులు ఉంటాయని, అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్పాయి. 257 బాత్ రూమ్‌లు, 5 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయట. ప్రపంచంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ ప్యాలెస్‌గా ఈయనపేరిట గిన్నీస్ రికార్డు ఉంది. బ్రూనై సుల్తాన్ హసనల్‌కు తన ప్యాలెస్‌లో వంద గ్యారేజ్‌లు ఉన్నాయి. వాటిలో 7వేల లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటి విలువ దాదాపు 5 బిలియన్ డాలర్లు ఉంటుందట. ప్రపంచంలో ఎవరి దగ్గర లేని 600 రోల్స్‌ రాయిస్‌ కార్లతో అరుదైన రికార్డులో నిలిచారు. అత్యంత విలాసవంతమైన లైఫ్‌ను గడుపుతున్న హసనల్ గురించి తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ప్రధాని మోదీ బ్రూనై పర్యటనతో హసనల్‌ బోల్కియా గురించి భారతీయులు ఆరా తీస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్థిక సహాయంపై కిషన్‌రెడ్డి కీలక ప్రకటన..

కృష్ణమ్మ ఉగ్రరూపం.. లంక కన్నీళ్లు..

ఏపీకి భారీ విరాళాలు.. సీఎం కృతజ్ఞతలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 04 , 2024 | 09:28 AM