Share News

Akash Ambani: శ్రీవారి సేవలో ఆకాశ్‌ అంబానీ

ABN , Publish Date - Apr 03 , 2025 | 04:50 AM

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ కుమారుడు, జియో చైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ దర్శనం అనంతరం గోశాలను సందర్శించి గోపూజలో పాల్గొన్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ పర్యటన జరిగింది.

Akash Ambani: శ్రీవారి సేవలో ఆకాశ్‌ అంబానీ

తిరుమల, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ పెద్ద కుమారుడు, జియో చైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పంచె కట్టు, నుదుట బొట్టుతో ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1 క్యూలైన్‌ ద్వారా ఆయన ఆలయంలోకి వెళ్లారు. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానంతరం ఆకాశ్‌ అంబానీకి వేద పండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. అనంతరం తిరుమలలోని గోశాలను సందర్శించిన ఆకాశ్‌ అంబానీ గోపూజలో పాల్గొన్నారు. శ్రీవారి వాహన సేవల్లో పాల్గొనే గజరాజుల(ఏనుగుల) ఆశీర్వాదం పొందారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆకాశ్‌ అంబానీ తిరుమల పర్యటన సాగింది.


ఇవి కూడా చదవండి:

FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..

Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..

Updated Date - Apr 03 , 2025 | 04:50 AM