Gorantla Madhav : ఒక్కసారి వచ్చిపో మాధవా..!
ABN , Publish Date - Feb 28 , 2025 | 12:55 AM
మాజీ ఎంపీ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్‌కు విజయవాడ సైబర్ క్రైం పోలీసుల నుంచి ‘ఆహ్వానం’ అందింది. పోక్సో కేసు బాధితుల వివరాలను మీడియా సమావేశంలో బహిరంగపరిచినందుకు ఆయనపై గత ఏడాది నవంబరు 2న కేసు నమోదైంది. వైసీపీ హయాంలో రాష్ట్ర మహిళా కమిషన చైర్‌పర్సనగా పనిచేసి, ఆ తరువాత పార్టీని వీడిన వాసిరెడ్డి పద్మ ఆయనపై ఫిర్యాదు చేశారు. విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషనలో భారతీయ నాగరిక్ సురక్షితా సంహిత ...

మాజీ ఎంపీ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్‌కు విజయవాడ సైబర్ క్రైం పోలీసుల నుంచి ‘ఆహ్వానం’ అందింది. పోక్సో కేసు బాధితుల వివరాలను మీడియా సమావేశంలో బహిరంగపరిచినందుకు ఆయనపై గత ఏడాది నవంబరు 2న కేసు నమోదైంది. వైసీపీ హయాంలో రాష్ట్ర మహిళా కమిషన చైర్‌పర్సనగా పనిచేసి, ఆ తరువాత పార్టీని వీడిన వాసిరెడ్డి పద్మ ఆయనపై ఫిర్యాదు చేశారు. విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషనలో భారతీయ నాగరిక్ సురక్షితా సంహిత (బీఎనఎ్‌సఎ్‌స) సెక్షన్లు 72, 79 కింద నమోదైన ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆయనకు గురువారం నోటీసులు అందజేశారు.
విజయవాడ నుంచి గురువారం వచ్చిన పోలీసులు, గోరంట్ల మాధవ్ ఇంటికి వెళ్లి నోటీసులను అందజేశారు. మార్చి 5వ తేదీన విజయవాడకు వచ్చి తమ ఎదుట హాజరు కావాలని సూచించారు. ‘వెళ్లాలా.. వద్దా..’ అనేది తన న్యాయవాదులతో చర్చించి నిర్ణయించుకుంటానని మాధవ్ మీడియాతో అన్నారు. ఆ రోజు తన కార్యక్రమాల షెడ్యూల్ లేకపోతే వెళతానని, లేకుంటే గడువు కోరుతానని కూడా అన్నారు. ‘మీరు మాజీ పోలీసు అధికారి కదా..? పోక్సో కేసు బాధితుల వివరాలను అలా ఎలా చెప్పారు..?’ అని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై అంతెత్తు ఎగిరారు. ‘ఏ టీవీ..? ఏ మీడియా..? ఏ పత్రిక..?’ అని ఎదురు ప్రశ్నలు వేశారు.
- ఆంధ్రజ్యోతి, అనంతపురం
మరిన్ని అనంతపురం వార్తల కోసం....