DEATH : మహేశ్వర్ రెడ్డి మృతిపై అనుమానాలు
ABN , Publish Date - Jan 27 , 2025 | 12:13 AM
ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన ఉమామహేశర్‌రెడ్డి మృతిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని, దీనిపై సమగ్ర ద ర్యా ప్తు జరపాలని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ పోలీస్ అధికారులను డిమాండ్ చేశారు. సో ములదొడ్డి సమీపంలో రైలు పట్టాల వద్ద పడిఉన్న ఉమా మహే శ్వర్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు జిల్లా ఆస్పత్రికి తరలించారు.

సమగ్ర దర్యాప్తు జరపాలి - పరిటాల శ్రీరామ్ డిమాండ్
అనంతపురం టౌన, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన ఉమామహేశర్‌రెడ్డి మృతిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని, దీనిపై సమగ్ర ద ర్యా ప్తు జరపాలని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ పోలీస్ అధికారులను డిమాండ్ చేశారు. సో ములదొడ్డి సమీపంలో రైలు పట్టాల వద్ద పడిఉన్న ఉమా మహే శ్వర్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిటాల శ్రీరామ్ ఆస్పత్రికి వెళ్లి ఉమామహేశ్వర్‌రెడ్డి మృతదేహం వద్ద నివాళులర్పించారు. అక్క డే ఉన్న కుటుంబసభ్యుల ఓదార్చి, అండగా తామున్నామంటూ భరోసా ఇచ్చారు. అనంతరం శ్రీరామ్ మీడియాతో మాట్లాడు తూ... తోపుదుర్తి మహేష్‌రెడ్డి 2019 తరువాత తనను కలిశారని, అప్పటినుంచి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఆయన సోదరులు ఉమామహేశ్వర్ రెడ్డిని టార్గెట్ చేస్తూవచ్చా రన్నా రు. అనేక ఇబ్బందులుపెట్టారన్నారు. అయినా ఉమామహేశ్వర్ రెడ్డి ధైర్యంగా నిలబడ్డారన్నారు. కొంతకాలంగా ప్రకాష్‌రెడ్డి సోద రుడు రాజశేఖరరెడ్డి(రాజారెడ్డి) బెదరింపులకు దిగుతున్నార న్నారు. ఇందుకు ఫేస్‌బుక్‌లో ఉన్న పోస్టులే సాక్ష్యమన్నారు. ఈ క్రమంలోనే ఉమామహేశ్వర్‌రెడ్డి రైలు పట్టాలపై శవమై కనిపిం చడం పట్ల చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించి కేసును తప్పుదారి పట్టించడా నికి కుట్రలు పన్నుతున్నారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని శ్రీరామ్ డిమాండ్ చేశారు. ఈ మృతిపై ఎస్పీని కలుస్తామని, అవసరమైతే రాష్ట్రస్థాయిలో ఉన్నతస్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు.
విచారణ చేయాలి : బండి పరశురామ్
అనంతపురం విద్య, జనవరి 26(ఆంధ్రజ్యోతి): తోపుదుర్తి మహేష్ మృతిపై పోలీసులు విచారణ చేయాలని టీఎనఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురాం ఆదివారం ఒక ప్రక టనలో డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి సోదరు లు తనను బెదిరిస్తున్నారంటూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టిన మరుసటి రోజే తోపుదుర్తి మహేష్‌రెడ్డి అనుమానాస్పదంగా రైలు పట్టాల వద్ద శవమై కనిపించాడన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....