MP Parhasarathi అర్హులకే ఉద్యోగాలు : ఎంపీ
ABN , Publish Date - Mar 22 , 2025 | 11:59 PM
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అర్హులకే పెద్దపీట అని హిందూపురం లోక్‌సభ సభ్యుడు బీకే పార్థసారథి పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ఆవరణలో శనివారం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామితో కలిసి అంగనవాడీ నియామక పత్రాలను అందజేశారు.

మడకశిరటౌన, మార్చి 22(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అర్హులకే పెద్దపీట అని హిందూపురం లోక్‌సభ సభ్యుడు బీకే పార్థసారథి పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ఆవరణలో శనివారం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామితో కలిసి అంగనవాడీ నియామక పత్రాలను అందజేశారు. ఇటీవల నిర్వహించిన ఇంటర్వ్యూలలో ఆరుగురు ఎంపిక కాగా వారికి నియామకపత్రాలు అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో చిన్న అటెండర్ పోస్టు కోసం కూడా భారీగా చేతివాటం ప్రదర్శించావారని, డబ్బు ఇచ్చిన వారికే ఉద్యోగాలు వచ్చేవని అన్నారు. చంద్రబాబు పాలనలో అలాంటి వాటికి ఆస్కారం ఉండదని, అర్హత ఉన్న వారికే నియామకాలు జరిగినట్లు తెలిపారు. అనంతరం విద్యుత సబ్‌స్టేషనలో ఆపరేటర్లకు నియామకపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీనివాసమూర్తి, పాండురంగప్ప, లక్ష్మీనారాయణ, గణేష్, భక్తర్ పాల్గొన్నారు.