attendance విధులకు రాకున్నా.. హాజరు పట్టికలో సంతకాలు.!
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:18 AM
మండలంలోని చామాలగొంది పంచాయతీ కార్యదర్శి మధునమోహననాయక్ గత నెల 13 రోజుల పాటు విధులకు రాలేదు. అయితే కురమామిడి సచివాలయంలో హాజరు పట్టికలో మాత్రం అతను విధులకు హాజరైనట్లు సంతకాలు ఉన్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది

గాండ్లపెంట, మార్చి 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని చామాలగొంది పంచాయతీ కార్యదర్శి మధునమోహననాయక్ గత నెల 13 రోజుల పాటు విధులకు రాలేదు. అయితే కురమామిడి సచివాలయంలో హాజరు పట్టికలో మాత్రం అతను విధులకు హాజరైనట్లు సంతకాలు ఉన్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. గత నెలలో గ్రూపు-2 పరీక్షల నిమిత్తం అతను విధులకు హాజరుకాలేదని సమాచారం. ఎంపీడీఓతో కుమ్మకై ఆయన విధులకు రాకున్నా.. హాజరు పట్టికలో సంతకాలు చేశారనే ఆరోపణలున్నాయి. దీనిపై ఎంపీడీఓ వెంకటరామిరెడ్డిని వివరణ కోరగా.. అతను విధులకు హాజరుకాలేదనే విషయం తన దృష్టికి రాలేదని, విచారణ చేసి.. తగు చర్యలు తీసుకుంటామని అన్నారు.