CPI : వాగ్దానాలను అమలు చేయాలి
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:14 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అయలు చూయాలని, లేని పక్షంలో ఉద్యమాలు తప్పవని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ హెచ్చరించారు. సోమవారం స్థానిక వాసవీ కల్యాణమండపంలో సీపీఐ మండల మహాసభలు నిర్వహించారు.

శింగనమల, మార్చి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అయలు చూయాలని, లేని పక్షంలో ఉద్యమాలు తప్పవని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ హెచ్చరించారు. సోమవారం స్థానిక వాసవీ కల్యాణమండపంలో సీపీఐ మండల మహాసభలు నిర్వహించారు.కార్యక్రమానికి జాఫర్‌తోపాటు పాల్యంనారాయణస్వామి, నియోజకవర్గ కార్యదర్శి నారాయణస్వామి, చిన్నప్పయాదవ్ హాజరయ్యారు. మొదట పార్టీ జెండాను నాయకులు ఆవిష్కరించారు. గ్రామంలో ర్యాలీ చేపట్టారు. జాఫర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని, రైతులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, సూపర్ సిక్స్ పథకాల జాడే లేదన్నారు. మధుయాదవ్, శ్రీనివాసులు, లలితమ్మ, మునిస్వామి, ఓబుళపతి, చంద్ర,రామాసూబ్బారెడ్డి పాల్గొన్నారు. అనంతరం నూతన మండల కమిటీ ఎన్నుకున్నారు. కార్యదర్శిగా మధుయాదవ్, సహాయ కార్యదర్శిగా నేసె మధు, చికెనబాషాలను ఎన్నుకున్నారు.