Share News

Handreeniva హంద్రీనీవా లైనింగ్‌ ఆపాలి

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:20 AM

హంద్రీనీవా కాలువ లైనింగ్‌ పనులను వెంటనే ఆపాలని ఏపీ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక ప్రశాంతి గ్రామం వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Handreeniva హంద్రీనీవా లైనింగ్‌ ఆపాలి
మాట్లాడుతున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌ రెడ్డి

పుట్టపర్తి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా కాలువ లైనింగ్‌ పనులను వెంటనే ఆపాలని ఏపీ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక ప్రశాంతి గ్రామం వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాలువ వెడల్పు చేయాలని విడుదల చేసిన జీఓ నెంబర్లు 404,405 రదు చేయాలని, కాలువ లైనింగ్‌ పనులను ఆపకపోతే యంత్రాలను పగలకొడతామని హెచ్చరించారు. కరువు పీడిత ప్రాంతంగా ఉన్న రాయలసీమ పంట పొలాలకు నికరసాగు జలాలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా ఆరు లక్షలకు పైగా ఎకరాలకు ఆయకట్టుకు నీరు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు హరి, నాగరాజు, కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, జలసాధన సమితి గంగిరెడ్డి, మహదేవ, కాటమయ్య, గిరీశ, సోమశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2025 | 12:20 AM