-
-
Home » Andhra Pradesh » Today Breaking News and Telangana Assembly Sessions Parlament Sessions and Betting Apps Issue IPL 2025 Live Updates in Telugu News suri
-

Breaking News: బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు హాజరుకాని రీతు చౌదరి..
ABN , First Publish Date - Mar 25 , 2025 | 08:05 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-03-25T13:24:41+05:30
మాజీ మంత్రి రజనీకి రోజురోజుకూ బిగుస్తున్న ఉచ్చు..
పల్నాడు: మాజీ మంత్రి విడదల రజనీపై కేసులో సంచలనంగా మారిన ఐపీఎస్ అధికారి జాషువా వాగ్మూలం
రాజకీయ కారణాలతోనే శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్‌పై రజనీ ఫిర్యాదు చేశారంటూ జాషువా వెల్లడి
మాజీ మంత్రి రజనీనే స్వయంగా వచ్చి ఫిర్యాదు చేశారని తెలిపిన ఐపీఎస్ అధికారి జాషువా
క్రషర్స్ భాగస్వాములు ప్రతిపక్ష టీడీపీ సానుభూతిపరులు కాబట్టే వేధింపులంటూ వాగ్మూలం
మైనింగ్ నిబంధనలు ఉల్లంఘించారని, ప్రభుత్వానికి రాయల్టీ ఎగవేశారని ఆమె ఫిర్యాదుతో విచారణ జరిపామన్న జాషువా
క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి దాదాపు రూ.10.5 కోట్ల మైనింగ్ రాయల్టీ ఎగవేతను అంచనా వేస్తూ విజిలెన్స్ నివేదిక
సర్వే నిర్వహిస్తున్న సిబ్బందిపై రాజకీయ ఒత్తిడి ఉందని తన విచారణలల వెల్లడైందని తెలిపిన జాషువా
వైసీపీ మహిళా నేత రజనీ అప్పట్లో ఇచ్చిన ఫిర్యాదు గుంటూరు విజిలెన్స్ ఆఫీసులో మాయం
రజనీ ఫిర్యాదు మాయం కావడంపై విచారణ చేస్తున్న విజిలెన్స్ అధికారులు
-
2025-03-25T13:07:25+05:30
బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు హాజరుకాని రీతు చౌదరి..
హైదరాబాద్: పంజాగుట్ట పోలీసుల విచారణకు రీతు చౌదరి గైర్హాజరు
ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట దాటినా విచారణకు రాని రీతు చౌదరి
నేడు విచారణకు హాజరుకాకపోతే మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం
గత గురువారం రీతు చౌదరి, విష్ణుప్రియను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు
నేడు ఇద్దరినీ విచారించేందుకు నోటీసులు ఇచ్చిన పంజాగుట్ట పోలీసులు
తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన విష్ణు ప్రియ
కోర్టు ఆదేశాల ప్రకారం విష్ణు ప్రియ విషయంలో ముందుకు వెళ్లనున్న పోలీసులు
మరోవైపు పంజాగుట్ట పోలీసులకు అందుబాటులోకి రాని మరికొంతమంది నిందితులు
వారిని సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్న పోలీసులు
ఇప్పటికే నిందితులు ప్రమోట్ చేసిన వీడియోలను సేకరించిన పోలీసులు
బెట్టింగ్ యాప్స్ యాజమానులపైనా దృష్టి పెట్టి కూపీ లాగుతున్న పోలీసులు
-
2025-03-25T12:30:52+05:30
వృద్ధురాలిపై అత్యాచారం.. ఆపై..
కరీంనగర్: సైదాపూర్ మండలంలో వెలుగు చూసిన దారుణ ఘటన
70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసిన కామాంధుడు
ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై అత్యాచారం చేసి నగదు దోచుకెళ్లిన దుర్మార్గుడు
గ్రామస్థుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు
పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నట్లు సమాచారం
-
2025-03-25T12:14:22+05:30
అసెంబ్లీ ముట్టడికి యత్నం.. న్యాయవాదులు అరెస్టు..
హైదరాబాద్: అసెంబ్లీ ముట్టడికి యత్నించిన తెలంగాణ న్యాయవాదులు
అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ని అమలు చేయాలని న్యాయవాదుల ఆందోళన
గన్ పార్క్ వద్ద ఆందోళనకు దిగిన న్యాయవాదులను అరెస్టు చేసిన పోలీసులు
నిన్న న్యాయవాది మృతికి నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగిన న్యాయవాదులు
-
2025-03-25T11:57:47+05:30
దద్దరిల్లిన బీజాపూర్- దంతేవాడ జిల్లాల సరిహద్దులు..
ఛత్తీస్‌గఢ్: మరోసారి దద్దరిల్లిన బీజాపూర్- దంతేవాడ జిల్లాల సరిహద్దులు
భద్రతాదళాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు
ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు మృతి, మరికొంతమందికి తీవ్రగాయాలు
భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కొనసాగుతున్న ఎదురుకాల్పులు
ఎదురుకాల్పుల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం
సంఘటనా స్థలం నుంచి మావోల మృతదేహాలు, ఆయుధాలు స్వాధీనం
ఎన్‌కౌంటర్‌ని ధ్రువీకరించిన బస్తర్ ఉన్నతాధికారులు, పోలీసులు
-
2025-03-25T11:44:34+05:30
పార్టీ ఫిరాయింపులపై ప్రారంభమైన విచారణ..
ఢిల్లీ: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ప్రారంభమైన విచారణ
అనర్హత పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం
ముగ్గురు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా స్పీకర్ స్పందించలేదని కోర్టుకు తెలిపిన న్యాయవాది
కనీసం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులూ ఇవ్వలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లిన సుందరం
ఫిర్యాదులపై ఏం చేస్తారో నాలుగు వారాల్లో షెడ్యూల్ చేయమని మాత్రమే ఆదేశాలు ఇచ్చారని చెప్పిన న్యాయవాది
అయినప్పటికీ స్పీకర్ పార్టీ మారిన వారికి నోటీసులు ఇవ్వలేదు: న్యాయవాది సుందరం
సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాతే నోటీసు ఇచ్చారు: న్యాయవాది సుందరం
-
2025-03-25T11:25:58+05:30
ఏప్రిల్‌లోనే మెగా డిఎస్సీ.. సీఎం చంద్రబాబు క్లారిటీ..
అమరావతి: కలెక్టర్లు అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు కాదు.. సీఈవో ఆఫ్ ది డిస్ట్రిక్ట్: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ ఊహించుకుని కలెక్టర్లంతా పని చేయాలి: సీఎం చంద్రబాబు
కలెక్టర్‌గా చేసిన పనుల వల్లే మీ ఇమేజ్ శాశ్వతంగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
ఇప్పటికే చాలా మంది ఇంపాక్ట్ క్రియేట్ చేసిన కలెక్టర్ల గురించి మాట్లాడుతాం: సీఎం చంద్రబాబు
గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది: సీఎం చంద్రబాబు
దేశంలోనే అతి పెద్ద డీబీటీ ప్రోగ్రాం సామాజిక భద్రతా పించన్లు: సీఎం చంద్రబాబు
ఏడాదికి రూ.33 వేల కోట్లు ఈ ఒక్క పథకానికే ఖర్చు చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
ఏప్రిల్ మెుదటి వారంలోనే మెగా డిఎస్సీ ఉంటుంది: సీఎం చంద్రబాబు
-
2025-03-25T09:27:34+05:30
ఫిరంగిపురంలో గందరగోళం..
గుంటూరు: ఫిరంగిపురం శాంతి నగర్‌లో మంగళవారం అర్ధరాత్రి ఉద్రిక్తత
పోలేరమ్మ ఆలయ స్థలం విషయంలో గ్రామస్థులు, చిన్నికృష్ణ కుటుంబసభ్యుల మధ్య వివాదం
గొడవ నేపథ్యంలో పోలీసులకు సమాచారం అందించిన గ్రామస్థులు
గ్రామానికి చేరుకుని వీడియో తీస్తున్న యువకుడిపై సీఐ రవీంద్రబాబు దాడి
యువకుడికి తీవ్రగాయాలు, సీఐ తీరుపై ఆగ్రహించిన గ్రామస్థులు
పోలీసులు, గ్రామస్థులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం
పోలీసుల కారుపై రాళ్లు రువ్వి అద్దాలు ధ్వంసం చేసిన ఆందోళనకారులు
సీఐ క్షమాపణ చెప్పాలని కర్నూలు- గుంటూరు రాహదారిపై టైర్లు తగలపెట్టి రాస్తారోకో
రాహదారిపై ట్రాఫిక్ అంతరాయం, ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు
ముందుగా గ్రామస్థులే దాడికి ప్రయత్నించి రాళ్లు విసిరారని సీఐ రవీంద్రబాబు వెల్లడి
-
2025-03-25T09:16:09+05:30
రూ.100 కోట్లతో ఉడాయించిన నిందితుడు అరెస్టు..
హైదరాబాద్: చిట్టీల పేరుతో వేల మందిని మోసగించిన నిందితుడు పుల్లయ్య అరెస్ట్
రూ.100 కోట్లు మోసం చేసి ఉడాయించిన పుల్లయ్యను అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు
బెంగళూరులో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించిన పోలీసులు
స్వాహా చేసిన సొమ్మును బెంగళూరులో బిల్డర్లకు పెట్టుబడిగా పెట్టినట్లు గుర్తింపు
తాపీ మేస్త్రిగా పనిచేస్తూ చిట్టీల పేరుతో వేల మందిని మోసం చేసిన పుల్లయ్య
-
2025-03-25T08:47:19+05:30
హైకోర్టుకు యాంకర్ విష్ణు ప్రియ
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ విష్ణు ప్రియ
తనపై నమోదైన కేసు క్వాష్ చేయాలంటూ పిటిషన్ వేసిన విష్ణు ప్రియ
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్‌లు క్వాష్ చేయాలంటూ పిటిషన్
నేడు విష్ణు ప్రియ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్న హైకోర్టు ధర్మాసనం
కాగా, విష్ణప్రియను నేడు విచారణకు హాజరుకావాలని ఆదేశించిన పంజాగుట్ట పోలీసులు
-
2025-03-25T08:27:35+05:30
భారత్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు..
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో 48 గంటల్లో భారత్‌కు శ్రవణ్ రావు
శ్రవణ్ రావుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
విచారణకు హాజరవుతారని స్పష్టం చేసిన శ్రవణ్ రావు తరుఫు న్యాయవాది
పోలీసుల విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశం
-
2025-03-25T08:11:50+05:30
ఎస్ఎల్‌బీసీ టన్నెల్.. మృతదేహం గుర్తింపు
నాగర్ కర్నూల్: దోమలపెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు
మట్టిలో కూరుకుపోయిన లోకో ట్రైన్ బోగీలో కనిపించిన కార్మికుడి మృతదేహం
వెలికి తీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సింగరేణి రెస్క్యూ టీమ్
-
2025-03-25T08:05:51+05:30
బెట్టింగ్ యాప్స్ కేసు. నేడు విచారణకు యాంకర్స్..
హైదరాబాద్: పంజాగుట్ట పోలీసుల ఎదుట నేడు విచారణకు హాజరుకానున్న యాంకర్ విష్ణు ప్రియ, రీతు చౌదరి
ఈనెల 20న విష్ణుప్రియ, రీతు చౌదరిని విచారించిన పంజాగుట్ట పోలీసులు
విష్ణుప్రియను పదిగంటలు, రీతు చౌదరిని ఆరు గంటలపాటు విచారించిన పోలీసులు
బెట్టింగ్ యాప్స్ నుంచి వారికి వచ్చిన నగదుపై ఆరా తీసిన పోలీసులు
బ్యాంకు లావాదేవీలు పరిశీలించి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు
తాజాగా నేడు మరోసారి వారిని విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న పంజాగుట్ట పోలీసులు