Share News

Shakti app శక్తి యా్‌పపై అవగాహన కల్పించాలి: ఎస్పీ

ABN , Publish Date - Apr 05 , 2025 | 12:27 AM

శక్తి యాప్‌పై జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఎస్పీ రత్న పోలీసు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. దీంతో శక్తి టీం జిల్లా నోడల్‌ అధికారి, మహిళా పీఎస్‌ డీఎస్పీ ఆదినారాయణ పర్యవేక్షణలో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రధాన కూడళ్లలో శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమాలను శుక్రవారం ప్రారంభించారు.

Shakti app శక్తి యా్‌పపై అవగాహన కల్పించాలి: ఎస్పీ
బస్టాండులో శక్తి యా్‌పపై అవగాహన కల్పిస్తున్న మహిళా పోలీసులు

పుట్టపర్తి రూరల్‌, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): శక్తి యాప్‌పై జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఎస్పీ రత్న పోలీసు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. దీంతో శక్తి టీం జిల్లా నోడల్‌ అధికారి, మహిళా పీఎస్‌ డీఎస్పీ ఆదినారాయణ పర్యవేక్షణలో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రధాన కూడళ్లలో శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమాలను శుక్రవారం ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో డీఎస్పీ మాట్లాడుతూ.. శక్తి యాప్‌ మహిళలకు అత్యవసర సమయాల్లో ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. తక్షణ సాయం అందించే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం మహిళల సెల్‌ ఫోనలలో యాప్‌ను ఇనస్టాల్‌ చేయించారు.

Updated Date - Apr 05 , 2025 | 12:27 AM