టెక్ వ్యూ : భారీ కరెక్షన్‌కు ఆస్కారం
ABN , Publish Date - Apr 07 , 2025 | 04:23 AM
నిఫ్టీ గత వారం కీలక స్థాయు 23,000 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమై ముందు వారంతో పోల్చితే 615 పాయింట్ల నష్టంతో 22,900 వద్ద ముగిసింది. 2,000 పాయింట్ల మేరకు ర్యాలీ సాధించిన నేపథ్యంలో ఈ కరెక్షన్ ఊహించినదే...

టెక్ వ్యూ : భారీ కరెక్షన్‌కు ఆస్కారం
నిఫ్టీ గత వారం కీలక స్థాయు 23,000 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమై ముందు వారంతో పోల్చితే 615 పాయింట్ల నష్టంతో 22,900 వద్ద ముగిసింది. 2,000 పాయింట్ల మేరకు ర్యాలీ సాధించిన నేపథ్యంలో ఈ కరెక్షన్ ఊహించినదే అయినప్పటికీ సాధారణం కన్నా అధికంగా ఉండడం అప్రమత్త సంకేతం. రాబోయే కొద్ది రోజుల్లో మార్కెట్ నిలదొక్కుకుంటే తప్ప తక్షణ ర్యాలీకి ఆస్కారం లేదు. అమెరికన్ మార్కెట్లలో గత శుక్రవారం ఏర్పడిన తీవ్ర బేరిష్ ధోరణి వల్ల ఈ వారం మన మార్కెట్ భారీ ప్రతికూల ధోరణిలోనే ప్రారంభం కావచ్చు. తీవ్రమైన కదలికలకు కూడా ఆస్కారం ఉంది. వారం ప్రారంభ ట్రేడింగ్ ఎలా ఉంటుందో కూడా ఊహించడం కష్టం. ఇటీవల ఏర్పడిన కనిష్ఠ స్థాయిల్లో మరోసారి పరీక్ష ఎదుర్కొనవచ్చు.
బుల్లిష్ స్థాయిలు: మరింత బలహీనత సాధించినట్టయితే కనిష్ఠ స్థాయి 22,500 వద్ద మద్దతు తీసుకోవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే సానుకూల సంకేతం వెలువడుతుంది. రికవరీ బాట పడితే మానసిక అవధి 23,000.
బేరిష్ స్థాయిలు: 22,500 వద్ద మద్దతు తీసుకోలేకపోతే మరింత బలహీనతలో పడుతుంది. మద్దతు స్థాయి 22,350. ఇక్కడ కూడా విఫలమైతే మరింత బలహీనపడుతుంది. తదుపరి మద్దతు స్థాయిలు 22,200, 22,000.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ మాత్రం గత వారంలో మైనర్ రియాక్షన్ మాత్రమే సాధించి 51,500 వద్ద ముగిసింది. గత రెండు వారాల్లో 52,000 వద్ద నిరోధం ఎదుర్కొంటోంది. మరింత అప్‌ట్రెండ్ కోసం ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి. స్వల్పకాలిక మద్దతు స్థాయి 50,800 వద్ద విఫలమైతే స్వల్పకాలిక బలహీనతలో ప్రవేశిస్తుంది.
పాటర్న్: మార్కెట్ ప్రస్తుతం 50, 100 డిఎంఏల కన్నా దిగువకు వచ్చింది. సానుకూలత కోసం 22,500 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ తప్పనిసరిగా పునరుజ్జీవం సాధించాలి.
టైమ్: ఈ సూచీ ప్రకారం బుధవారం తదుపరి మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 22,550, 22,700
మద్దతు : 22,500, 22,350
వి. సుందర్ రాజా
ఇవి కూడా చదవండి:
BSNL: పుంజుకున్న బీఎస్ఎన్ఎల్, కొత్తగా 55 లక్షల మంది కస్టమర్లు..మొత్తం ఎంతంటే..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News

తగ్గనున్న లోన్ ఈఎంఐలు

క్రేజీ ఆఫర్..రూ.6కే డైలీ 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ ఇంకా..

50 ఏళ్ల తర్వాత నెలకు రూ.లక్ష కావాలంటే ఇలా చేస్తే చాలు..

ఇన్వెస్ట్ చేస్తున్నారా, లోన్ తీసుకుంటున్నారా..ఈ కొత్త రేట్లు తెలుసా..

ఫోన్‌పే, గూగుల్‌పే వాడుతున్నారా
