Ugadi ఉత్సాహంగా ఉట్లమాను పరుష
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:06 AM
పట్టణంలోని దుర్గమ్మ దేవాలయం వద్ద మంగళవారం నిర్వహించిన ఉట్లమాను పరుష ఉత్సాహంగా సాగింది. ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకుని ఏటా ఉట్లమాను పరుషతో పాటు పలు పోటీలు నిర్వహించడం ఆనవాయితీ.

ధర్మవరం, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని దుర్గమ్మ దేవాలయం వద్ద మంగళవారం నిర్వహించిన ఉట్లమాను పరుష ఉత్సాహంగా సాగింది. ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకుని ఏటా ఉట్లమాను పరుషతో పాటు పలు పోటీలు నిర్వహించడం ఆనవాయితీ. మంగళవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉట్లమాను పరుష నిర్వహించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఉట్లమాను పోటీలో స్థానిక బోయవీధికి చెందిన బోయజనార్దన విజేతగా నిలిచాడు. దీంతో ఆలయ కమిటీ సభ్యులు అతనికి రూ.10,016 బహుమతిని అందజేసి.. అభినందించారు.