Chandrababu Naidu: జగన్ కుట్రలతో జాగ్రత్త.. 2019లో అందుకే ఓడిపోయాం: ఏపీ సీఎం
ABN , Publish Date - Feb 28 , 2025 | 08:15 PM
వైసీపీ, జగన్ కుట్ర రాజకీయాలతో జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా లేకపోవడం వల్లే 2019 ఎన్నికల్లో నష్టపోయామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీఎల్పీ సమావేశంలో జగన్ కుట్ర సిద్దాంతాలను చంద్రబాబు సవివరంగా చెప్పారు. ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ సమావేశంలో సీఎం పలు విషయాల గురించి సూచనలు చేశారు.

వైసీపీ, జగన్ కుట్ర రాజకీయాలతో జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా లేకపోవడం వల్లే 2019 ఎన్నికల్లో నష్టపోయామని చంద్రబాబు (Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. టీడీఎల్పీ సమావేశంలో జగన్ (YS Jagan) కుట్ర సిద్దాంతాలను చంద్రబాబు సవివరంగా చెప్పారు. ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ సమావేశంలో సీఎం పలు విషయాల గురించి సూచనలు చేశారు. రాజకీయ క్రిమినల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, నేరం చేసి పక్కవాడిపై నెపం వేయడంలో వైసీపీ వారు సిద్దహస్తులని వివేకా హత్య ఘటనను వివరించారు (AP News).
వివేకా హత్య కేసులో జగన్ అండ్ కో ఆడిన నాటకాలు, చేసిన కుట్రలను సీఎం పాయింట్ టు పాయింట్ వివరించారు. ఆ కుట్రల పట్ల అప్రమత్తంగా లేకపోవడంతోనే 2019 ఎన్నికల్లో నష్టపోయామని చంద్రబాబు అన్నారు. నాటి తప్పులు మళ్లీ జరగకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ఎన్నికలకు ముందు గులకరాయి డ్రామాను తిప్పి కొట్టిన విధానాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు యాక్టివ్ గా ఉండాలని, సోషల్ మీడియాలో భాగం కావాలని పిలుపునిచ్చారు. మంచిని, నిజాన్ని ముందే గట్టిగా చెప్పక పోతే, వైసీపీ వాళ్లు చెడునే విశ్వవ్యాప్తం చేస్తారని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Pawan Kalyan: భవిష్యత్తులో ఏపీలో రాబోయే మార్పులు చెప్పిన పవన్
Vamsi Petition: బ్యారక్ మార్చండి.. లేదా ఖైదీలను పంపండి.. వంశీ పిటిషన్
మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..