Atal Bhujal Yojana : ఏపీకి అటల్ భూజల్ యోజన!
ABN , Publish Date - Feb 11 , 2025 | 06:41 AM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు విస్తరించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం నీటి కొరత ఉన్న 7 రాష్ట్రాల్లో

8,200 కోట్లతో కొత్తగా 5 రాష్ట్రాలలో విస్తరణకు కేంద్రం యోచన
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: భూగర్భ జలాల సుస్థిరతను పెంపొందించేందుకు అమలు చేస్తున్న అటల్ భూజల్ యోజన పథకాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు విస్తరించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం నీటి కొరత ఉన్న 7 రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రూ.8,200 కోట్లతో 5 రాష్ట్రాలలో కేంద్ర ప్రాయోజిత పథకంగా అమలు చేసేందుకు ఆర్థిక శాఖలోని ఖర్చుల విభాగం ప్రాథమిక అనుమతి ఇచ్చింది. కాగా సోమవారం లోక్‌సభలో బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ సారథ్యంలోని జలవనరుల స్థాయీ సంఘం జల్ జీవన్ మిషన్‌పై నివేదిక సమర్పించింది. 2024 డిసెంబరు నాటికి దేశంలోని అన్ని గ్రామీణ కుటుంబాలకు కొళాయి నీరు ఇవ్వాలన్న జల్ జీవన్ మిషన్ లక్ష్యం.. గడువు ముగిసినా నెరవేరలేదని ఆందోళన వ్యక్తం చేసింది.