Bee Attack: తేనెతుట్టె కదిలి.. మధ్యలో ఆగిన అంతిమయాత్ర
ABN , Publish Date - Mar 29 , 2025 | 05:28 AM
అల్లూరి జిల్లా గన్నేరుకొయ్యపాడులో ఓ వృద్ధురాలి అంతిమయాత్రలో బాణ సంచా పేలడంతో తేనెతుట్టె కదిలి, తేనెటీగల దాడికి కారణమైంది. ఈ ఘటనలో 26 మంది గాయపడగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

ఎటపాక, మార్చి 28 (ఆంరఽధజ్యోతి): ఓ వృద్ధురాలి అంతిమయాత్రలో బాణ సంచా పేలుడుకు తేనెతుట్టె కదిలి కలకలం రేగింది. అంతిమయాత్రలో పాల్గొన్నవారిపై తేనెటీగలు దాడి చేయడంతో మృతదేహాన్ని రెండు గంటలపాటు రహదారిపై వదిలి పరుగులు తీశారు. ఈఘటన అల్లూరి జిల్లా ఎటపాక మండలం గన్నేరుకొయ్యపాడులో జరిగింది. తేనెటీగల దాడిలో 26 మంది గాయపడ్డారు. ముగడ చంద్రశేఖర్ అనే వ్యక్తి తేనే టీగల దాడిలో స్పృహ కోల్పోయాడు. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చివరికి బంఽధువులు మృతదేహాన్ని ట్రాక్టర్‌లో శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.
Also Read:
42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..
మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు
కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..
For More Andhra Pradesh News and Telugu News..