Share News

IPL 2025, PBKS vs LSG: పంజాబ్ సూపర్ విక్టరీ.. లఖ్‌నవూపై సునాయాస విజయం

ABN , Publish Date - Apr 01 , 2025 | 10:40 PM

పంజాబ్ కింగ్స్ ఐపీఎల్‌లో తన హవా కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ తాజా మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై సునాయాస విజయం సాధించింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (69) మెరపు అర్థశతకం సాధించడంతో వార్ వన్‌సైడ్‌గా మారిపోయింది.

IPL 2025, PBKS vs LSG: పంజాబ్ సూపర్ విక్టరీ.. లఖ్‌నవూపై సునాయాస విజయం
Prabhsimran Singh

పంజాబ్ కింగ్స్ ఐపీఎల్‌లో (IPL 2025) తన హవా కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ తాజా మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై (PBKS vs LSG) సునాయాస విజయం సాధించింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (69) మెరపు అర్థశతకం సాధించడంతో వార్ వన్‌సైడ్‌గా మారిపోయింది. వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా శ్రేయస్ అయ్యర్ (52 నాటౌట్) అర్ధశతకం సాధించాడు. నేహల్ వధేరా (43 నాటౌట్) కూడా సమయోచితంగా రాణించడంతో ఈ సీజన్‌లో పంజాబ్ వరుసగా రెండో విజయం సాధించింది.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రేయస్ అయ్యర్ నమ్మకాన్ని నిలబెడుతూ పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. నికోలస్ పూరన్ (44), ఆయుష్ బదోనీ (41) చెప్పుకోదగ్గ స్కోరు సాధించారు. మార్‌క్రమ్ (28), అబ్దుల్ సమద్ (27) విలువైన పరుగులు చేశారు. దీంతో లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్ (2) మరోసారి విఫలమయ్యాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. ఫెర్గూసన్, మ్యాక్స్‌వెల్, జాన్సన్, ఛాహల్ ఒక్కో వికెట్ తీశారు.


అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ ఆరంభంలోనే ప్రియాంశ్ ఆర్య (8) వికెట్ కోల్పోయింది. అయితే ప్రభ్‌సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ అద్భుత హాఫ్ సెంచరీలతో పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చారు. చివర్లో నేహల్ వధేరా వేగంగా ఆడాడు. దీంతో పంజాబ్ 16.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దిగ్వేశ్ సింగ్ రెండు వికెట్లు తీశాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 01 , 2025 | 10:40 PM