Share News

హుండీ.. వడ్డీ

ABN , Publish Date - Mar 25 , 2025 | 01:32 AM

టీటీడీ తాజాగా ప్రవేశపెట్టిన నూతన బడ్జెట్‌లోనూ శ్రీవారి హుండీ, వడ్డీ ద్వారానే ఆదాయం భారీగా సమకూరుతుందని అంచనా వేసింది. గడిచిన ఏడాది హుండీ ద్వారా రూ.1,611 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేయగా, రూ.1,671 కోట్ల కానుకలు లభించాయి.

హుండీ.. వడ్డీ

టీటీడీకి ప్రధాన ఆదాయ వనరులివే

స్వల్పంగా పెరిగిన ఆదాయ అంచనా

తిరుమల, మార్చి24(ఆంధ్రజ్యోతి): టీటీడీ తాజాగా ప్రవేశపెట్టిన నూతన బడ్జెట్‌లోనూ శ్రీవారి హుండీ, వడ్డీ ద్వారానే ఆదాయం భారీగా సమకూరుతుందని అంచనా వేసింది. గడిచిన ఏడాది హుండీ ద్వారా రూ.1,611 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేయగా, రూ.1,671 కోట్ల కానుకలు లభించాయి. ఈక్రమంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.1,729 కోట్ల హుండీ ఆదాయం లభిస్తుందని టీటీడీ అంచనా వేసింది. రూ.900 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్లలోపు ఉండే హుండీ ఆదాయ అంచనాలు కొవిడ్‌ అనంతరం భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఈక్రమంలో 2022-23 బడ్జెట్‌లో హుండీ ద్వారా రూ.వెయ్యి కోట్లు లభిస్తుందని అంచనా వేయగా ఎవరూ ఊహించని విధంగా రూ.1,613 కోట్లు లభించింది. అలాగే 2023-24కి గాను రూ.1,611, 2024-25కి గాను రూ.1,671 కోట్ల అదాయం లభించింది.

ఫ మరోవైపు వడ్డీల ద్వారా గతేడాది రూ.1,167 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేయగా, రూ.1,253 కోట్లు లభించింది. ఈక్రమంలో నూతన బడ్జెట్‌లో రూ.1,310 కోట్లు వడ్డీల ద్వారా లభిస్తుందని టీటీడీ అంచనా వేస్తోంది. కొవిడ్‌ ముందు వరకు వడ్డీల ద్వారా కేవలం రూ.800 కోట్లలోపే సమకూరేది.

ఫ దర్శనంపై గతేడాది రూ.338 కోట్లు లభిస్తుందని టీటీడీ అంచనా వేసినప్పటికీ రూ.305 కోట్లు మాత్రమే సమకూరింది. దీంతో 2025-26 వార్షిక ఏడాదికి కేవలం రూ.310 కోట్లు మాత్రమే వస్తుందని అంచనా వేశారు.

ఫ ప్రసాదాల ద్వారా రూ.600 కోట్లు లభిస్తుందని గతేడాది భావించగా రూ.50 కోట్లు తగ్గింది. అయినప్పటికీ రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.600 కోట్లు వస్తుందని భావిస్తున్నారు.

ఫ గతేడాది ఇంజినీరింగ్‌ పనులకు, ఇంజినీరింగ్‌ నిర్వహణకు రూ.540 కోట్లు కేటాయించినప్పటికీ రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. తాజా వ్యయాల అంచనాలోనూ రూ.500 కోట్లే కేటాయించారు.

ఫ గతేడాది గరుడవారఽధి నిర్మాణానికి రూ.53 కోట్లు కేటాయించినప్పటికీ రూ.25 కోట్లే ఖర్చు చేశారు. దీంతో తాజా బడ్జెట్‌లో రూ.28 కోట్లు కేటాయించారు.

ఫ గడిచిన ఏడాది ధార్మిక ప్రచారానికి రూ.131.50 కోట్లు ఖర్చు కాగా, నూతన బడ్జెట్‌లో రూ.10 కోట్లు తగ్గించారు.

బడ్జెట్‌లో పొందుపరిచిన అంచనాల వివరాలు

ఆదాయాల అంచనా.. (రూ.కోట్లలో)

ప్రారంభనిల్వ 488.90

హుండీ 1,729

వడ్డీ 1,310

ప్రసాదాలు 600

దర్శన టికెట్లు 310

ఆర్జితసేవలు 130

అద్దెగదులు, కల్యాణమండపాలు 157

తలనీలాల వేలం 176.50

రుణాలు, సెక్యూరిటీ-డిపాజిట్లు తదితరాల ద్వారా 76.38

ట్రస్టులు 90

అద్దెలు, విద్యుత్‌బిల్లులు, వాటర్‌ బిల్లులు 66

ప్రచురణల విక్రయాలు 31

ఇతర ఆదాయాలు(అగర్‌బత్తి, టోల్‌గేట్‌ వంటివి) 93.90

----------------------

5,258.68

---------------------

వ్యయాల అంచనా.. (కోట్లలో)

మానవ వనరులు 1,773.75

వస్తువుల కొనుగోళ్లు 768.50

కార్ఫస్‌ అండ్‌ ఇన్వ్‌స్టమెంట్స్‌ 800

ఇంజినీరింగ్‌ పనులు 350

గరుడవారధి 28

స్విమ్స్‌ ఆస్పత్రి ఇంజినీరింగ్‌ క్యాపిటల్‌ వర్క్స్‌ 60

స్విమ్స్‌ రెవెన్యూ గ్రాంట్స్‌ 60

ఇంజినీరింగ్‌ నిర్వహణ పనులకు 150

ఫ్యాకల్టీ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ 80

ఇతర సంస్థలకు గ్రాంట్స్‌ 130

హిందూధార్మిక ప్రచారానికి 121.50

రుణాలు, ముందుగా ఉద్యోగులకు చెల్లింపులు, ఈఎమ్‌డీ,

సెక్యూరిటీ డిపాజిట్స్‌ 177.62

పెన్షన్‌ ఫండ్‌ కాంట్ర్యుబ్యూషన్స్‌ 100

విద్యుత్‌ ఉత్పత్తికయ్యే వ్యయం 70

కాంట్రుబ్యూషన్స్‌ టు స్టేట్‌ గవర్నమెంట్‌ 50

ఇతర క్యాపిటల్‌ పనులు 52.50

ఇతర చెల్లింపులు 50.08

ఇతర నిర్వహణ ఖర్చులు 40

ప్రకటనలు 8

క్లోజింగ్‌ క్యాష్‌, బ్యాంక్‌ నిల్వ 448.73

----------------------

5,258.68 కోట్లు

-----------------------

Updated Date - Mar 25 , 2025 | 01:32 AM