Ponytail Incident - Coach Fired: మ్యాచ్‌లో ఓటమితో ఆగ్రహం.. బాలిక జుట్టు పట్టి లాగిన కోచ్‌కు భారీ షాక్
ABN , Publish Date - Mar 26 , 2025 | 04:38 PM
బాస్కెట్ బాల్ మ్యాచ్‌లో బాలికల టీం ఓడిపోవడం సహించలేకపోయిన ఓ కోచ్ ఓ బాలిక జుట్టుపట్టి లాగి అభాసుపాలయ్యాడు. ఘటపై ఆగ్రహించిన స్కూలు యాజమాన్యం ఆయనను విధుల నుంచి తొలగించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నె్ట్ డెస్క్: క్రీడల్లో గెలుపోటములు సహజం. ఇలాంటి సందర్భాల్లో క్రీడాకారులు భావోద్వేగానికి లోనవుతుంటారు. కానీ, కోచ్‌లు ఇందుకు భిన్నంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా క్రీడాకారులకు వెన్నుదన్నుగా నిలవాలి.. ధైర్యం చెప్పాలి.. స్థిరచిత్తంతో మెలగాలి. కోచ్‌గా ఉన్న ఓ 81 ఏళ్ల పెద్దమనిషి ఇవన్నీ మర్చిపోయాడు. కోపంతో రెచ్చిపోయాడు. టీమ్ సభ్యురాలైన ఓ బాలికను నలుగురిలో దారుణంగా అవమానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో చివరకు ఆ పెద్దాయన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
Also Read: ఫైవ్ స్టార్ హోటల్‌ను బురిడీ కొట్టించబోయిన కంటెంట్ క్రియేటర్.. చివరకు ఏం జరిగిందో తెలిస్తే..
న్యూయార్క్ రాష్ట్రంలోని నార్త్‌విల్ హైస్కూల్‌లో ఈ ఘటన జరిగింది. ఇటీవల జరిగిన ఓ బాస్కె్ట్ బాల్ మ్యాచ్‌లో స్కూల్ బాలికల బాస్కెట్ బాల్ టీం ఓడిపోయింది. దీంతో, క్రీడాకారులంతా షాక్ తిన్నారు. ఆ టీమ్‌కు కోచ్‌గా ఉన్న జిమ్ జులోకు (81) కోపం కట్టలు తెంచుకుంది. కోచ్‌గా తన బాధ్యతలను గాలికొదిలేశాడు. హుందాతనం, మర్యాదలను పక్కన పెట్టేసి జట్టులోని బాలిక జుట్టును లాగి అందరి ముందూ ఘోరంగా అవమానించాడు.
ఈ ఘటనకు బాలిక షాకైపోయింది. ఏం చేయాలో తెలీక మ్రాన్పడిపోయింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో యువతి బాలికకు అండగా నిలిచింది. తమ జోలికి రావద్దని కోచ్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. దీంతో, ఆయన వెనక్కు తగ్గాడు.
ఇక వీడియో వైరల్ కావడంతో స్థానికంగా పెను కలకలానికి దారి తీసింది. నెట్టింట తీవ్ర స్థాయిలో విమర్శులు వెల్లువెత్తాయి. దీంతో, స్కూలు అధికారులు కూడా స్పందించారు. కోచ్ తీరు అసలేమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. తమ టీచర్లు, కోచ్‌లు అత్యున్నత ప్రవర్తన కలిగి ఉండాలని భావిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆ కోచ్‌ను తొలగించామని వెల్లడించారు.
Read Also: విమానాల్లో ఇచ్చే ఆహారం రుచి వేరుగా ఉంటుందని ఎప్పుడైనా అనిపించిందా? దీనికి కారణం ఏంటంటే..
ఈ ఉదంతంతో ఉద్యోగం కోల్పోయాక జిమ్ కూడా నెట్టింట క్షమాపణలు చెప్పాడు. విద్యార్థినిని, ఆమె కుటుంబసభ్యులను తనను మన్నించమని అభ్యర్థించాడు. తన ప్రవర్తన విచారకరమని అంగీకరించాడు. జట్టు ప్రదర్శనపై పూర్తి సంతృప్తితో ఉన్నట్టు కూడా చెప్పుకొచ్చాడు. ఇక ఘటన తాలుకు వీడియో నెట్టింట ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
Also Read: ప్రపంచంలో బాగా పాప్యులర్ అయిన ఈ విండోస్ వాల్‌పేపర్ చరిత్ర గురించి తెలిస్తే..