Share News

తిరుమల చేరుకున్న ఏకసభ్య కమిషన్‌

ABN , Publish Date - Mar 15 , 2025 | 12:55 AM

‘తిరుపతి’ తొక్కసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య న్యాయవిచారణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ సత్యనారాయణమూర్తి శుక్రవారం రాత్రి తిరుమల చేరుకున్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులు వెళ్లే క్యూలైన్ల నిర్వహణపై శని, ఆదివారాల్లో పరిశీలించనున్నారు.

తిరుమల చేరుకున్న ఏకసభ్య కమిషన్‌

తిరుపతి(కలెక్టరేట్‌), మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ‘తిరుపతి’ తొక్కసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య న్యాయవిచారణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ సత్యనారాయణమూర్తి శుక్రవారం రాత్రి తిరుమల చేరుకున్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులు వెళ్లే క్యూలైన్ల నిర్వహణపై శని, ఆదివారాల్లో పరిశీలించనున్నారు. సోమవారం నుంచి వారం రోజుల పాటు టీటీడీ, పోలీసు, రెవెన్యూతో పాటు తొక్కిసలాట ఘటనలో గాయపడిన 16మంది క్షతగాత్రులను (మొత్తం సుమారు వందమంది) విచారించనున్నారు. ఇప్పటికే 17న హాజరు కావాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, టీటీడీ ఈవో శ్యామలరావు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజుకు నోటీసులు పంపారు. ఇక 18నుంచి బదిలీ, సస్పెండైన అధికారులతో పాటు పలువురిని ఆరురోజుల పాటు విచారించి, వాంగ్మూలం స్వీకరించనున్నారు. ఈ మూడో దశ విచారణ అత్యంత కీలకంగా మారనుంది.

Updated Date - Mar 15 , 2025 | 12:55 AM