Share News

త్వరలో పోలీసు శాఖ ప్రక్షాళన!

ABN , Publish Date - Mar 24 , 2025 | 02:11 AM

చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఇప్పటికే భారీగా పోలీసు బదిలీలు జరిగాయి. ఇప్పుడు తిరుపతి జిల్లాలోనూ పోలీసు శాఖ ప్రక్షాళనకు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు దృష్టి పెట్టారు. పోలీసు అధికారులు, సిబ్బంది ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా బదిలీలు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి మరో 10 రోజుల్లో కసరత్తు పూర్తి చేయనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది ఎవరు? గతంలో ఏకపక్షంగా వ్యవహరించిన వారు.. ఇప్పటికీ తీరు మార్చుకోని వాళ్లతో పాటు సమర్థంగా విధుల నిర్వహణ, క్రమశిక్షణ, కేసుల నమోదు, బాధితులకు న్యాయం అందించడంలో ముందుంటున్న వారి గురించీ వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నట్లు సమాచారం. సీఐలతో పాటు 40 మందికిపైగా ఎస్‌ఐలు, 480 మందికిపైగా ఏఎ్‌సఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను బదిలీ చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

త్వరలో పోలీసు శాఖ ప్రక్షాళన!

- భారీగా బదిలీలకు కసరత్తు

తిరుపతి(నేరవిభాగం), మార్చి 23(ఆంధ్రజ్యోతి): చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఇప్పటికే భారీగా పోలీసు బదిలీలు జరిగాయి. ఇప్పుడు తిరుపతి జిల్లాలోనూ పోలీసు శాఖ ప్రక్షాళనకు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు దృష్టి పెట్టారు. పోలీసు అధికారులు, సిబ్బంది ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా బదిలీలు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి మరో 10 రోజుల్లో కసరత్తు పూర్తి చేయనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది ఎవరు? గతంలో ఏకపక్షంగా వ్యవహరించిన వారు.. ఇప్పటికీ తీరు మార్చుకోని వాళ్లతో పాటు సమర్థంగా విధుల నిర్వహణ, క్రమశిక్షణ, కేసుల నమోదు, బాధితులకు న్యాయం అందించడంలో ముందుంటున్న వారి గురించీ వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నట్లు సమాచారం. సీఐలతో పాటు 40 మందికిపైగా ఎస్‌ఐలు, 480 మందికిపైగా ఏఎ్‌సఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను బదిలీ చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

Updated Date - Mar 24 , 2025 | 02:11 AM