Share News

రేపటినుంచి పుంగనూరు గంగజాతర

ABN , Publish Date - Mar 24 , 2025 | 01:55 AM

పుంగనూరులో మంగళ, బుధవారాల్లో సుగుటూరు గంగమ్మ జాతర జరగనుంది. ఈ క్రమంలో గంగజాతర ఏర్పాట్లు, భద్రతపై నగరిలోని జమీందార్ల ప్యాలె్‌సను అధికారులతో కలిసి ఆదివారం పలమనేరు డీఎస్పీ ప్రభాకర్‌ పరిశీలించారు. జాతర ప్రశాంతంగా జరగడానికి అందరూ సహకరించాలని కోరారు. ప్యాలె్‌సలోని జమీందార్లు సోమశేఖర్‌ చిక్కరాయులు, మల్లికార్జునలతో చర్చించారు. అమ్మవారిని కొలువుదీర్చే స్థలం పురాతన భవనం కావడంతో భక్తుల రద్దీని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

రేపటినుంచి పుంగనూరు గంగజాతర
జమీందార్లతో కలిసి ఏర్పాట్లను పరిశీలిస్తున్న డీఎస్పీ ప్రభాకర్‌

- ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ

పుంగనూరు, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): పుంగనూరులో మంగళ, బుధవారాల్లో సుగుటూరు గంగమ్మ జాతర జరగనుంది. ఈ క్రమంలో గంగజాతర ఏర్పాట్లు, భద్రతపై నగరిలోని జమీందార్ల ప్యాలె్‌సను అధికారులతో కలిసి ఆదివారం పలమనేరు డీఎస్పీ ప్రభాకర్‌ పరిశీలించారు. జాతర ప్రశాంతంగా జరగడానికి అందరూ సహకరించాలని కోరారు. ప్యాలె్‌సలోని జమీందార్లు సోమశేఖర్‌ చిక్కరాయులు, మల్లికార్జునలతో చర్చించారు. అమ్మవారిని కొలువుదీర్చే స్థలం పురాతన భవనం కావడంతో భక్తుల రద్దీని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అమ్మవారి ఊరేగింపు రహదారులను పర్యవేక్షించారు. అలాగే విద్యుత్‌, మున్సిపల్‌, అగ్నిమాపకశాఖ, ఆరోగ్య, ఇంజనీరింగ్‌ అధికారులు కూడా భక్తులకు సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చిన్నపిల్లల భద్రత దృష్ట్యా పేరెంట్‌ ట్యాగ్‌ విధానాన్ని ప్రవేశ పెడతామని చెప్పారు. ట్యాగ్‌లో పిల్లల తల్లిదండ్రులు, పుంగనూరు ఎస్‌ఐ ఫోన్‌ నెంబరు పొందుపరుస్తామన్నారు. దొంగతనాలు జరగకుండా పోలీసులను మఫ్టీలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు ఎస్బీ సీఐ భాస్కర్‌, పుంగనూరు రూరల్‌ సీఐ రాంభూపాల్‌, సీసీఎస్‌ సీఐ ఉమామహేశ్వర్‌రావు, ఎస్పీడీసీఎల్‌ ఏడీఈ పి.శ్రీనివాసులు, ఎస్‌ఐ లోకేశ్‌, ఫైర్‌ ఆఫీసర్‌ సుబ్బరాజు, రెవెన్యూ, ఎక్సైజ్‌ తదితర శాఖల అధికారులు, కమిటీ సభ్యులు, హిందూ, ముస్లిం మతపెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2025 | 01:55 AM