Tirupati.. ఉత్కంఠగా సాగిన తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక..
ABN , Publish Date - Feb 04 , 2025 | 01:07 PM
తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి ఎన్నిక ఉత్కంఠభరితంగా సాగింది. ఈరోజు జరిగిన ఎన్నికలో కూటమి అభ్యర్థి, టీడీపీ నేత ఆర్సీ మునికృష్ణ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 26.. వైఎస్సార్‌సీపీకి 21 ఓట్లు పోలయ్యాయి. దీంతో కూటమి అభ్యర్థి గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

తిరుపతి: మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation ) టీడీపీ (TDP) వసమైంది. తిరుపతి (Tirupati ) డిప్యూటీ మేయర్ (Deputy Mayor )గా ఆర్సీ మునికృష్ణ (RC Munikrishna) ఎన్నికయ్యారు (Victory). తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 26.. వైఎస్సార్‌సీపీకి 21 ఓట్లు పోలయ్యాయి. ఈ సందర్బంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. డిప్యూటీ మేయర్ ఎన్నికలో కూటమి విజయం సాధిస్తుందని నిన్ననే (సోమవారం) చెప్పామని అనుకున్నది సాధించామని అన్నారు. నిన్న తమ కార్పొరేటర్లు నలుగురిని వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డుకుని, కిడ్నాప్ చేశారని.. కిడ్పాన్ అయిన వారందరూ తిరిగి వచ్చేశారని తెలిపారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 26 ఓట్లతో విజయం సాధించిందన్నారు.
ఈ వార్త కూడా చదవండి..
హామీ నెరవేర్చిన సీఎం ..సీమకు న్యాయం
వైఎస్సార్‌సీపీ నేతలు ఈ రోజు కూడా అడ్డదారిన గెలవాలని చూశారని.. దానిని తిప్పి కొట్టామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ చెప్పారు. శ్రీవారి ఆశీస్సులతో ఎన్డీయే కూటమి అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక లాంఛనంగా గెలుపొందారని ఎమ్మెల్యే తెలిపారు. మునికృష్ణ మాట్లాడుతూ.. 26 మంది సభ్యులు తనకు ఓట్లు వేసి డిప్యూటీ మేయర్‌గా ఎన్నుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన కార్పొరేటర్లకు, అండగా నిలిచిన ఎమ్మెల్యేకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే స్థానిక మంత్రి, తనకు మద్దతు తెలిపిన ఇతర నాయకులకు మనికృష్ణ ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి అభివృద్ధికి కృషి చేస్తామని, కూటమి నేతలను కలుపుకుని తిరుపతిలో ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
కాగా తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎంతో ఉత్కంఠభరితంగా జరిగింది. సోమవారం జరగాల్సిన ఎన్నిక వాయిదా పడింది. అలాగే మంగళవారం కూడా ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ప్రశాంతంగానే ఓటింగ్ జరిగింది. చివరికి కూటమి అభ్యర్థి గెలుపుతో కథ సుఖాంతమైంది. 47 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్ ఆఫిషియో నెంబర్లు.. మొత్తం 50 మంది. అయితే ఈరోజు ఓటింగ్‌లో 48 మంది పాల్గొన్నారు. ఇద్దరు అనారోగ్యంతో రాలేకపోయారు. దీంతో ఓటింగ్ నిర్వహంచిన ఎన్నికల అధికారి ముందు వైఎస్సార్‌సీపీ వాళ్లు చేతులెత్తాలని కోరగా 21 మంది చేతులెత్తారు. తర్వాత కూటమి నేతలు 26 మంది చేతులెత్తారు. దీంతో కూటమి అభ్యర్థి మునికృష్ణ డిప్యూటీ మేయర్‌గా గెలుపొందినట్లు అధికారి ప్రకటించారు.
కాగా డిప్యూటీ మేయర్ ఎన్నిక సోమవారం జరగాల్సి ఉంది. కోరం లేక ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. ఆదివారం రాత్రి నుంచి తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై హై డ్రామా (High Drama) కొనసాగింది. ఆదివారం రాత్రి టీడీపీ శిబిరం (TDP camp)పై వైఎస్సార్‌సీపీ నేతలు (YSRCP Leaders) దౌర్జన్యానికి దిగారు. కార్పొరేటర్‌ను వైఎస్సార్‌సీపీ నేత భూమన లాక్కెళ్లినట్లు టీడీపీ నేతలు ఆరోపించారు. కోరం 25 మంది ఉండాలి. అయితే 22 మంది మాత్రమే ఉన్నారు. దీంతో అధికారులు ఎన్నికల నిబంధనల మేరకు ఎన్నికను మంగళవారం నాటికి వాయిదా వేశారు. దీంతో ఈరోజు గట్టి బందోబస్తు మధ్య డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించారు. మరోవైపు తిరుపతిలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారు. కొంతమంది కూటమిలో చేరారు. పాలనలో తమకు స్వేచ్ఛలేదని కూటమిలో చేరడంవల్ల తమకు గౌరవం పెరిగిందని కార్పొరేటర్లు అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలో ట్విస్ట్
డోనాల్డ్ ట్రంప్‌తో పీఎం మోదీ కీలక భేటీ..
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం
శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News