నేడు ‘పీజీఆర్‌ఎస్’
ABN , Publish Date - Mar 24 , 2025 | 01:43 AM
: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ సుమిత్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరిస్తామని తెలిపారు. ఆయా మండల, నియోజకవర్గాల్లో పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

చితూరు అర్బన్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ సుమిత్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరిస్తామని తెలిపారు. ఆయా మండల, నియోజకవర్గాల్లో పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా పోలీసు కార్యాలయంలోనూ..
జిల్లా పోలీసు కార్యాలయంలోనూ సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం జరుగుతుందని ఎస్పీ మణికంఠ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బాధితుల నుంచి వినతిపత్రాలను స్వీకరించి, వారి సమస్యలకు పరిష్కారం చూపుతామని తెలిపారు. బాధిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.