కౌన్సిలర్లకు తెలియకుండానే పనులు చేస్తారా..?
ABN , Publish Date - Mar 22 , 2025 | 11:38 PM
వార్డులో తమకు తెలియకుండా పనులు ఎలా చేస్తున్నా రని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిబంధనల ప్రకారమే పనులు చేస్తున్నామన్న కమిషనర్
ఎర్రగుంట్ల, మార్చి 22(ఆంధ్రజ్యోతి): వార్డులో తమకు తెలియకుండా పనులు ఎలా చేస్తున్నా రని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్ర గుంట్ల నగరపంచాయతి సర్వసభ్య సమావేశం శనివారం ఛైర్మన ఎం.హర్షవర్దనరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అజెండాలోని అంశా లను ఒక్కొక్కటిగా చదువుతుండగా కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం చెప్పారు. తమ వార్డుల్లో అనేక సమస్యలున్నాయని వాటిని పరిష్కరించకుండా ఇతర పనులకు ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. రూ.24లక్షలతో ఇదివరకే డ్రైన్ల క్లీనింగ్‌కు పెట్టి బిల్లులు తీసుకు న్నారని, మళ్లీ రూ.10లక్షలు ఎందుకు పెట్టారని కౌన్సిలర్లు ఆలి, నాగిరెడ్డి, కో ఆప్షన సభ్యు డు డి.సూర్యనారాయణరెడ్డిలు ప్రశ్నించారు. తమ వీధిలో విద్యుత మెయినలైన వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులున్నాయని, మనుషులు చనిపోతున్నారని చెప్పినా పట్టించుకో వడంలేదని విమర్శించారు. వార్డుల్లో కుళాయి కనెక్షన్లు కట్ చేయడంపై మండి పడ్డారు.
లిఖిత పూర్వకంగా ఇవ్వండి: సభ్యులు ఎవరైనా సమస్యలుంటే లిఖిత పూర్వకంగా తమకు ఇస్తే వాటిని కౌన్సిల్‌లో పెట్టి ఆమోదించి ప్రాధాన్యతాపరంగా పరిష్కరిస్తా మని కమిషనర్ పేర్లి శేషఫణి పేర్కొన్నారు. నీటి సరఫరా, శానిటేషనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని కమిషనర్ సమాధానం చెప్పారు. జగనన్న కాలనీలో రూ2.కోట్లతో అభివృద్ది పనులు చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారమే పనులు చేస్తున్నామని కౌన్సిల్ సభ్యులు నిబంధనలు తెలుసుకోకుండా మాట్లాడడం తగదన్నారు. కార్యక్రమంలో కౌన్సి లర్లు, అధికారులు పాల్గొన్నారు.