Hyderabad: దొంగతనానికి వచ్చి.. భవనంపై నుంచి కిందపడి..
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:02 AM
దొంగతనానికి వచ్చి భవనంపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడో గుర్తు తెలియని వ్యక్తి. ఈ సంఘటన నగరంలోని బేగంబజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

- వ్యక్తి మృతి
హైదరాబాద్: ఓ కాంప్లెక్స్‌లో దొంగతనానికి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు భవ నం పై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన బేగంబజార్ పోలీస్‌స్టేషన్(Begam Bajar Police Station) పరిధిలో జరిగింది. ఆబిడ్స్ ఏసీపీ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సమీపంలోని మనోరంజన్ కాంప్లెక్స్‌లోని రెండో అంతస్తులో అర్ధరాత్రి సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మూసి ఉన్న గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అలికిడి రావడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ వారు పట్టుకునేందుకు ప్రయత్నించారు.
ఈ వార్తను కూడా చదవండి: Rangarajan: నన్ను దాడి నుంచి కాపాడింది తిరుమలేశుడే
వారు భయంతో వేరే భవనంపైకి దూకేందుకు ప్రయత్నించగా ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డాడు. అతడి తలకు, ముఖానికి, కాళ్లకు, చేతులకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు బేగంబజార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మొదట సోషల్ మీడియాలో హత్యగా ప్రచారం కావడంతో ఆబిడ్స్ ఏసీసీ వెంకట్‌రెడ్డి, బేగంబజార్ సీఐ విజయ్‌కుమార్(Begambazar CI Vijay Kumar), క్లూస్ టీమ్‌లు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారించేందుకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
టీవీ నటిపై లైంగిక దాడికి యత్నం
పరీక్ష రాయనివ్వకపోతే చావే శరణ్యం
Read Latest Telangana News and National News