Share News

కరాటే మాస్టర్, పవన్ కల్యాణ్ గురువు మృతి

ABN , Publish Date - Mar 25 , 2025 | 10:43 AM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు , ప్రముఖ నటుడు మృతి చెందారు.

కరాటే మాస్టర్,  పవన్ కల్యాణ్ గురువు మృతి
Shihan Hussaini

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురువు, ప్రముఖ కోలీవుడ్ నటుడు షిహాన్ హుసైని తుది శ్వాస విడిచారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. నేడు (మంగళవారం) చనిపోయారు. హుసైని మృతిని ధ్రువీకరిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. బసంత్ నగర్‌లోని హుసైని నివాసంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.


’హుసైని మృతి చెందారని తెలపడానికి బాధపడుతున్నాము ఆయన మృత దేహాన్ని బసంత్ నగర్ నివాసంలో సాయంత్రం వరకు ఉంచుతున్నాము. సాయంత్ర 7 గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నాము‘ అని కుటుంబ సభ్యులు వెల్లడించారు. హుసైని మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

హుసైని.. ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్‌లో ట్రైనింగ్ ఇచ్చారు. ఆర్చరీలోనూ శిక్షకుడిగా ఉన్నాడు హుసైని. ఈ రంగంలో ఆయన సుమారు 400 మందికి పైగా ట్రైనింగ్ ఇచ్చారు.

హుసైని 1986లో రిలీజ్ అయిన పున్నగై మన్నన్ సినిమా ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయ్యారు. పలు చిత్రాల్లో నటించారు. అయితే విజయ్ హీరోగా నటించిన బది్ర సినిమా హుసైనికీ గుర్తింపునిచ్చింది.

ఇది కూడా చదవండి:

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు: లోకేశ్‌

అమరావతిలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ.

Updated Date - Mar 25 , 2025 | 10:49 AM