Share News

Sankranti - Pandem Kollu: పందెం కోళ్లు ఎన్ని రకాలో తెలుసా..?

ABN , Publish Date - Jan 13 , 2025 | 03:07 PM

Sankranti - Pandem Kollu: కోడి పందాలు షూరు అయ్యాయి. సంక్రాంతి వేళ.. ఉభయ గోదావరి జిల్లాల వేదికగా జరుగుతోన్న ఈ పందాలు వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది పోటెత్తారు.

Sankranti - Pandem Kollu: పందెం కోళ్లు ఎన్ని రకాలో తెలుసా..?

సంక్రాంతి వచ్చిందంటే.. కోడి పందాలు షూరు అవుతాయి. జూద క్రీడ లాగా.. ఈ కోడి పందాలు కూడా అత్యంత ప్రాచీనమైనవి. మహాభారతం నుంచి పల్నాటి చరిత్ర వరకు ఈ క్రీడల గురించి వివరిస్తుంది. అలాంటి ఈ కోడి పందాలు.. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల వేదికగా ప్రతి సంక్రాంతి వేళ.. జరుగుతాయి. ఈ పందాలు.. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. ఈ పందాల బరిలో నిలిచే కోడి పుంజులు .. చూడడానికి అంతా ఒకేలా ఉన్నా.. వాటిలో పలు రకాలు ఉంటాయన్న సంగతి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.

ఈ పందాల బరిలో నిలిచే కోడి పుంజులకు.. మాములు కోడి పుంజులకు చాలా వ్యత్యాసముంటుందని కోడి పందాల నిర్వాహకులు సోదాహరణగా వివరిస్తున్నారు. ఈ పందాల్లో పాల్గొనే కోడి పుంజులను ప్రత్యేకంగా పెంచడమే కాకుండా.. వాటికి ప్రత్యేక పౌష్టికాహారాన్ని సైతం పెడతారని చెబుతున్నారు. అంతేకాదు ఈ పందెం కోడి పుంజులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆ క్రమంలో ఎదుటి కోడి పుంజు కోట్టేలా తర్ఫీదు ఇస్తారు. ఇక ఈ పందెం కోడి పంజులకు చెరువులో ఈతను సైతం నేర్పుతారు.


కోడి పుంజుల్లో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో పందెంకోడి పుంజులు.. మరిన్ని రకాలు ఉన్నాయి. వాటికి వివిధ పేర్లు సైతం ఉన్నాయి. వాటిలో.. కాకి.. ఈ కోడిపుంజుకి నల్లని ఈకలుంటాయి. ఇక మరోకటి సేతు.. ఈ కోడి పుంజుకు ఈకలు మొత్తం తెల్లగా ఉంటాయి. అలాగే పర్ల.., ఈ పుంజుకు మెడపై నలుపు, తెలుపు రంగు ఈకలు ఉంటాయి. ఈ ఈకలు సమానంగా ఉంటాయి. అదే విధంగా సవల.. ఈ కోడి పుంజు మెడపై ఈకలు నల్లగా ఉంటాయి. అలాగే కొక్కిరాయి.. ఈ రకం పుంజు శరీరం నల్లగా ఉంటుంది. కానీ ఈ పుంజు శరీరంపై 2 లేదా 3 రకాల ఈకలుంటాయి.


డేగ.. ఈ కోడి పుంజు ఈకలు మొత్తం ఎర్రగా ఉంటాయి. నెమలి.. ఈ కోడి పుంజు రెక్కలపై లేదా వీపుపై పసుపు రంగు ఈకలు ఉంటాయి. కౌజు.. ఈ కోడి పుంజుకు మూడు రంగుల ఈకలు కలిగి ఉంటాయి. ఇవి నలుపు, ఎరుపు, పసుపు రంగులో ఉంటాయి. మైల.. ఈ కోడి పుంజు ఈకలు ఎరుపు, బూడిద రంగులో ఉంటాయి. పూల.. ఈ కోడి పుంజు ఒక్కో ఈక నలుపు, తెలుపు, ఎరుపు రంగులో కలిసి ఉంటాయి. పింగళ.. ఈ కోడి పుంజు రెక్కలు తెలుపు రంగులో ఉంటాయి.


అయితే అక్కడక్కడా నలుపు, గోధుమ రంగులో ఉంటాయి. నల్లబోర, ఎర్రపొడ, ముంగిస, జూలు రంగులో ఈకలుంటాయి. అబ్రాసు.. ఈ కోడి పుంజు ఈకలు లేత బంగారు రంగులో ఉంటాయి. గేరువా తెలుపు, లేత ఎరుపు రంగులో ఈకలుంటాయి. ఈ కోడి పందాల్లో.. కోట్లాది రూపాయిలు చేతులు మారతాయన్న సంగతి అందరికి తెలిసిందే.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 13 , 2025 | 03:14 PM