Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పదవుల పండగ
ABN , Publish Date - Apr 04 , 2025 | 06:13 PM
Nominated Posts: ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల కేటాయింపులు కొనసాగుతోన్నాయి. తాజాగా 38 నామినేటెడ్ పోస్టులు కేటాయించింది. అందులో టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన నేతలకు ఈ పోస్టులు కట్టబెట్టింది.

అమరావతి, ఏప్రిల్ 04: ఏపీలో నామినేటెడ్ పదవుల కేటాయింపు కొనసాగుతోంది. అందులోభాగంగా 38 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల పేర్లను ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ ఏఏంసీ ఛైర్మన్ పదవుల్లో 31 టీడీపీ, 6 జనసేన, 1 బీజేపీ నేతలకు కేటాయించిందీ ప్రభుత్వం. అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల ఛైర్మన్లను ప్రకటిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకోసం కసరత్తు జరుగుతోందని పేర్కొంది.
2024 మే, జూన్ మాసాల్లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ఓటరు కూటమికి పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేశాయి. ఈ నేపథ్యంలో సీట్ల సర్ధుబాటులో భాగంగా పలువురు సీనియర్లు ఎన్నిక వేళ.. సీట్లు వదులు కోవాల్సి వచ్చింది. అధికారంలోకి వచ్చిన అనంతరం నామినేటెడ్ పోస్టులు కట్టబెడతామంటూ వారికి హామీ సైతం ఇచ్చారు. ఇక సదరు ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు మొత్తం 175కి 164 స్థానాలకు గెలుచుకున్నాయి.
ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా పలువురు సీనియర్ నేతలకు ఇప్పటికే విడతల వారిగా కీలక పోస్టులు కేటాయించింది. ఈ కేటాయింపుల్లో సైతం మిత్ర ధర్మం పాటీస్తూ చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఆ క్రమంలో ఏఏంసీ చైర్మన్ల పేర్లను ప్రకటించారు. మిగతా వారి పేర్లను సైతం మరికొద్ది రోజుల్లో ప్రకటించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే
Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Read Latest AP News And Telugu News