Share News

TDP Criticism On Jagan: ముస్లింలకు జగన్ దోకా.. మోసం బయటపడిందన్న టీడీపీ నేత

ABN , Publish Date - Apr 04 , 2025 | 04:56 PM

TDP Criticism On Jagan: ముస్లిం సమాజంపై వైసీపీ మోసపూరిత విధానం బయటపడిందని టీడీపీ నేత నాగుల్ మీరా విమర్శలు గుప్పించారు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు నిన్నటి వరకు కబుర్లు చెప్పి వైసీపీ ఎంపీలు.. ఈరోజు బిల్లుకు మద్దుతగా ఓటేశారని మండిపడ్డారు.

TDP Criticism On Jagan: ముస్లింలకు జగన్ దోకా.. మోసం బయటపడిందన్న టీడీపీ నేత
TDP Criticism On Jagan

అమరావతి, ఏప్రిల్ 4: పార్లమెంట్ సాక్షిగా ముస్లింలకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Former Minister YS Jaganmohan Reddy) దోకా ఇచ్చారని టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా (TDP Leader Nagul Meera) ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి మాటలు ఒకలా ఉంటే చేతలు మరోలా ఉంటాయన్నారు. వక్ప్ చట్ట సవరణ బిల్లుపై వైసీపీ డబుల్ స్టాండ్ ప్రదర్శించిందని.. ముస్లిం సమాజంపై వైసీపీ మోసపూరిత విధానం బయటపడిందని విమర్శించారు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు నిన్నటి వరకు కబుర్లు చెప్పి నేడు మద్దుతగా వైసీపీ ఎంపీలు ఓటు వేశారన్నారు.


ముస్లింలను ఓటు బ్యాంక్‌గా వాడుకునే జగన్ రెడ్డి కనీసం వారి సంక్షేమం కోసం ఈ సవరణ చేయాలని చెప్పే గొంతు రాలేదని ప్రశ్నించారు. ‘దేనికి నీకు అంత భయం... ఇంత పిరికివాడివా జగన్ రెడ్డి’ అని నిలదీశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై వైసీపీ స్టాండ్ ఏంటి అనేది స్పష్టంగా చెప్పే ధైర్యం కూడా లేదా అంటూ మండిపడ్డారు. లోక్‌సభలో విప్ జారీ చేసి... రాజ్యసభలో ఎందుకు వదిలేశారో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముస్లింలపై వైసీపీ చిత్తుశుద్ధి ఏంటో ఇప్పుడు చూపించారన్నారు. వైసీపీ ముస్లిం నాయకులంతా ఆ పార్టీని వీడాలన్నారు. ‘వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై వైసీపీ స్టాండ్ ఏంటో చెప్పే ధైర్యం లేని వాడు మీకు నాయకుడా... సిగ్గులేదా’ అంటూ నాగుల్ మీరా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Crime On Train Washroom: ట్రైన్ వాష్‌రూమ్‌లో బాలికపై దారుణం


జగన్ చేతకాని నాయకుడు: నక్కా ఆనంద్

nakka-anand-babu.jpg

వక్ఫ్ బిల్లుపై జగన్ ముస్లింలను మోసం చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. వైసీపీకి స్టాండ్ అనేది లేదన్నారు. టీడీపీ ఎప్పుడు ఒకే స్టాండ్ పై ఉందని వెల్లడించారు. వక్ఫ్ బిల్లు వల్ల ముస్లింలకు నష్టం జరగకూడదని టీడీపీ సవరణల సమయంలో చెప్పిందన్నారు. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వైసీపీ అనుకూలంగా ఓటు వేసిందన్నారు. లోక్‌సభలో బిల్లుకు వైసీపీ వ్యతిరేకంగా ఓటు వేసిందని మండిపడ్డారు. జగన్ చేతగాని నాయకుడని విమర్శించారు. జగన్ తల్లిని చెల్లిని కాదు... ముస్లింలను మోసం చేశారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


జగన్ తీరుతో ముస్లిం వర్గాల షాక్

కాగా.. జగన్ డబుల్ స్టాండర్డ్ రాజకీయం మరోసారి బయటపడింది. వక్ఫ్ బిల్లుకు రాజ్యసభలో మద్దతుగా వైసీపీ ఎంపీలు ఓటేశారు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు నిన్నటి వరకు కబుర్లు చెప్పారు. అయితే ఎన్డీఏకు బలమున్న లోక్‌సభలో వ్యతిరేకించిన వైసీపీ... కేంద్రానికి కీలకమైన రాజ్యసభలో అనుకూలంగా ఓటేసింది. జగన్ సూచనలతో రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు మద్దతుగా ఎంపీలు ఓటు వేసినట్లు తెలుస్తోంది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఓటింగ్ తరువాత విప్ జారీతో వైసీపీ డ్రామా చేసింది. దీంతో ఓటింగ్ తరువాత విప్.. లోక్‌సభ చరిత్రలోనే లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ తీరును జాతీయ మీడియా, బిల్లును వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలు ఎండగడుతున్న పరిస్థితి. రాజ్యసభలో మద్దతుపై మైనారిటీ వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. జగన్ మోసం చేశాడనే భావనలో ముస్లింలు ఉన్నట్లు సమాచారం. వక్ఫ్ బిల్లు మైనారిటీలకు వ్యతిరేకం అంటూ నిన్నటి వరకు వైసీపీ వ్యాఖ్యలు చేసి.. నేడు రాజ్యసభలో సైలెంట్‌గా మద్దతు ఇచ్చేసింది. జగన్ తీరుతో ముస్లిం వర్గాలు షాక్ తిన్న పరిస్థితి. వైసీపీ వెన్నుపోటు రాజకీయాలపై ముస్లింలు మండిపడుతున్నారు. వ్యతిరేకిస్తున్నట్లు స్టేట్‌మెంట్‌లు ఇచ్చి వైసీపీ మోసం చేసిందంటూ ముస్లీం వర్గాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.


ఇవి కూడా చదవండి

Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే

Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 04 , 2025 | 05:28 PM